వారం లో జర్నలిస్టుల హౌసింగ్ వెబ్ సైట్ : మంత్రి కాల్వ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వారం లో జర్నలిస్టుల హౌసింగ్ వెబ్ సైట్ : మంత్రి కాల్వ

విజయవాడ, ఆగష్టు 7  (way2newstv.com)    
పాత్రికేయుడి జీవితం, రాజకీయ జీవితం పూర్తిగా భిన్నంగా ఉండేవని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం నాడు  అయన విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీట్ ధి ప్రెస్ కార్యక్రమం లో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ పాత్రికేయులందరికి హౌసింగ్ పధకం కింద ఇళ్ల మంజూరుకు కట్టుబడి ఉన్నాం. ఈ వారంలోనే పాత్రికేయుల ఇళ్ల మంజూరుకు సంబంధించి వెబ్ సైట్ ను ప్రారంభిస్తున్నాం. విపత్కర పరిస్థితుల్లో ఏర్పడ్డ రాష్ట్రం ఏమవుతుందో అనే ఆందోళన నుండి ఏమైనా చేయగలం అనే నమ్మకాన్ని ముఖ్యమంత్రి కల్పించారని అన్నారు. 

వారం లో జర్నలిస్టుల హౌసింగ్ వెబ్ సైట్ : మంత్రి కాల్వ 
అర్హులైన వారందరికీ రైతు రుణ మాఫీ ,పెన్షన్, రేషన్ అన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు. అన్ని వ్యవస్థలలో అవినీతి అక్రమాలకు అవకాశం లేకుండా పధకాలను  పారదర్శకంగా అమలు చేస్తున్నాం. రాష్ట్రం లో నీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటు నీటి సమస్యను సమర్ధంగా ఎదుర్కోగలిగామని అన్నారు. విభజన సమయంలో రాష్ట్రంలో పరిశ్రమలు లేవు. అలాంటి పరిస్థితి నుండి పెట్టుబడులకు కేంద్రంగా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి తీర్చి దిద్దారు. కీయా వంటి ప్రతిష్టాత్మకమైన పరిశ్రమ రాష్ట్రానికి వస్తుందనుకోలేదు. ముఖ్యమంత్రి అవలంబిస్తున్న విధానాలపై నమ్మకంతో వచ్చాయి. మొబైల్ ఫోన్ ల తయారీ కేంద్రాలు దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఏర్పాటు చేశారని మంత్రి అన్నారు. రాజకీయంలో తెదేపా ఎప్పుడు ఆకారణంగా,విమర్శలు కానీ,అబద్ధాలు కానీ చేయలేదు. రాజశేఖర్ రెడ్డి హయాంలో తెదేపా కార్యకర్తలను 54 మందిని హత్య చేశారు,అత్యంత భయానక పరిస్థితులు నెలకొల్పారు. తెదేపా ఎప్పుడు ప్రతీకార చర్యలు చేపట్టలేదు. నిరాధార ఆరోపణలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునివారిని ,ప్రోత్సహించకూడదని అయన అన్ఆనరు. ఇష్టం వచ్చినట్లు కోట్ల రూపాయలు ,పట్టిసీమతో,రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందని నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని మంత్రి సూచించారు.