నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు

హైదరాబాద్ ఆగష్టు 8 (way2newstv.com)    
రక్షణ శాఖ భూముల బదలాయింపు విషయంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. రక్షణ శాఖ భూముల బదలాయింపుపై తమకు ఎలాంటి సంశయం లేదన్నారు. అధికారులు వివరాలన్నీ సేకరించి ఖరారు చేస్తారని ఆమె పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాల విషయంలోనూ ఇలాగే వ్యవహరించామని కేంద్రమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్ ప్రజల ప్రయోజన దృష్ట్యా త్వరితగతిన సమస్యను పరిష్కారించాలని కేంద్రమంత్రికి కేటీఆర్ విన్నవించారు. 



నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు
Previous Post Next Post