వందేళ్లలో కనీవినీ వరదలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వందేళ్లలో కనీవినీ వరదలు

తిరువనంతపురం, ఆగస్టు 21, (way2newstv.com)
గత 12 రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, వైమానిక దళాలతోపాటు స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రజలు కూడా నిర్విరామంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ముంపు ప్రాంతాల్లోని 7.2 లక్షల మందిని సహాయక పునరావాస శిబిరాలకు తరలించారు. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా సాధారణానికి మించి అత్యధిక వర్షపాతం నమోదుకావడంతో కేరళలోని 14 జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వాస్తవానికి భారతదేశంలో వరదలు ప్రాణాంతకమైన ప్ర‌కృతి విపత్తు కానప్పటికీ, దేశవ్యాప్తంగా విస్తృతమైన నష్టాన్ని కలిగిస్తోంది. కానీ, మరింత ప్రమాదకరమైన జోన్‌లోని రాష్ట్రాలలో వరద నిర్వహణ కోసం కేటాయించిన నిధులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. 1980లో జాతీయ విపత్తు కమిషన్ అంచనాల ప్రకారం.. దేశంలో మొత్తం 40 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణం భూభాగం వరదలకు ప్రభావితమవుతుంది. ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పంజాబ్ రాష్ట్రాలే తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
 
 
 
 వందేళ్లలో కనీవినీ వరదలు
 
 ఉత్తరాఖండ్, యూపీలో 7.3 మిలియన్లు; బిహార్, ఝార్ఖండ్‌లో 4.3 మిలియన్లు, పంజాబ్ 3.7 మిలియన్లు, రాజస్థాన్ 3.3 మిలియన్లు, అసోం 3.2 మిలియన్లు, పశ్చిమ్ బెంగాల్ 2.7 మిలియన్లు, హరియాణా 2.4 మిలియన్లు; ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఒడిశాలో 1.4 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణం ముంపునకు గురవుతుంది.అలాగే వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది. జాతీయ గణాంకాల ప్రకారం.. 2015లో ప్ర‌కృతి వైపరీత్యాల వల్ల మొత్తం రూ.9,671 మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో అత్యధికంగా 2,641 మంది మెరుపులు, పిడుగుల వల్లే మృతిచెందారు. తర్వాత స్థానంలో వడదెబ్బ వల్ల 1,908, , తీవ్రమైన చలిగాలులు 1,149, వరదలు 846, కొండచరియలు 232, అంటు రోగాలు 218, అకాల వర్షాలు 195, 3,321 మందితో ఇతర వైపరీత్యాలు ఉన్నాయి. ఇక వైపరీత్యాలతో పోల్చితే వరదల కారణంగా జరిగిన ఆస్తి నష్టం ఎక్కువగా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పనుల కోసం పద కొండు, పన్నెండో ప్రణాళికలో మొత్తం రూ.13,238 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు కేవలం రూ.4,873 కోట్లు మాత్రమే విడుదలైనట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వరదల సాయం కోసం కేటాయించిన మొదటి పది రాష్ట్రాల్లో సగం కంటే తక్కువ నిధులు విడుదలయ్యాయి. సాధారణంగా వర్షాకాలంలో దేశవ్యాప్తంగా అత్యధిక వర్షపాతం కురిసే టాప్-10 జిల్లాల్లో కేరళ నుంచి ఒక్కటి మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఏడాది కేరళలోని నాలుగు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదుకావడం విశేషం