జనసేన గూటికి మోత్కుపల్లి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జనసేన గూటికి మోత్కుపల్లి

హైద్రాబాద్(way2newstv.com)
మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉండిన సీనియర్ పొలిటీషియన్ మోత్కుపల్లి నర్సింహులు జనసేనలోకి చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నేటి మధ్యాహ్నం మూడు గంటలకు జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌ను కలిసి మోత్కుపల్లి ఆ పార్టీలోకి చేరనున్నారని సమాచారం. ఈ సీనియర్ పొలిటిషియన్‌ను పవన్ కల్యాణ్ తన పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా నియమించనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల కాలం పని చేశారు మోత్కుపల్లి.జనసేన గూటికి మోత్కుపల్లి

 నాలుగేళ్ల కిందట కేంద్రంలో ఎన్డీయే సర్కారు రాగానే మోత్కుపల్లికి గవర్నర్ పదవి దక్కుతుందని కూడా ప్రచారం జరిగింది. అయితే అది జరగలేదు. అనంతర పరిణామాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడుతూ వరస ప్రెస్ మీట్లు పెట్టారు మోత్కుపల్లి. చంద్రబాబు తనకు తీవ్రమైన ద్రోహం చేశారని మోత్కుపల్లి విమర్శించారు. ఏపీలో బాబు ఓటమి కోసం తను ప్రార్థిస్తున్నానని ప్రకటించుకున్నారు. బాబును ఓడించాలని ఏపీలో ప్రచారం చేస్తానని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయవద్దని.. వైఎస్ జగన్ లేదా, పవన్ కల్యాణ్‌లకు ఓటు వేయాలని మోత్కుపల్లి ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మోత్కుపల్లిపై బహిష్కరణ వేటు వేసింది. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి జనసేనలోకి చేరబోతుండటం