అమరావతి (way2newstv.com)
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరును వైజాగ్ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్పు చేశారు. వీఎమ్ఆర్డీ పరిధి 5573 చ.కి.మీ. నుంచి 6764.59 చ.కి.మీ వరకు పెంచారు. వీఎమ్ఆర్డీ పరిధిలో 48 మండలాలు, 1340 గ్రామాలు ఉంటాయి. వుడాకు విశాఖ మెడ్ టెక్ జోన్ చెల్లించే రూ.11 కోట్ల పన్ను మినహాయింపునకు కుడా మంత్రివర్గం అమోదం తెలిపింది. ఫిజియోథెరపిస్టుల రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకు, కుప్పంలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు, నూతన చేనేత విధానానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
వుడా ఇక విఆర్డీయే
Tags:
Andrapradeshnews