రూ 2,158 కోట్లతో ప్రకాశం జడ్పీ బడ్జెట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రూ 2,158 కోట్లతో ప్రకాశం జడ్పీ బడ్జెట్

ఒంగోలు, ఫిబ్రవరి 21,(way2newstv.com):
జిల్లాలో త్రాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకొవాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు అధికారులను ఆధేశించారు. గురువారం స్థానిక ఒంగోలు పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఛైర్మన్ ఈదర హరిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఈదర హరిబాబు మాట్లాడుతూ జిల్లాలో రాబోయే వేసవిలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో అవసరమైన చోట డీప్ బోర్లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా వుండాలని అధికారులను ఆదేశించారు.  


రూ 2,158 కోట్లతో ప్రకాశం జడ్పీ బడ్జెట్

2019-20 సంవత్సరపు జిల్లా పరిషత్ అంచనా బడ్జట్ రూ.2,158 కోట్లతో, రూ. 2,155 కోట్ల రూపాయలు వ్యయంతో 2 కోట్ల 50 లక్షల  మిగులు బడ్జట్ తో జిల్లా పరిషత్ సర్వ   సభ్యపమావేశం తీర్మానించింది. ఇందులో గ్రామీణాభివృద్ది కార్యక్రమాలు, తలసరి గ్రాంటు, ఇసుక సీనిరీస్ గ్రాంట్, ఆస్ధి మార్పిడిపై సర్ ఛార్జి కలిపి 8 కోట్ల 90 లక్షల నరూపాయలు వస్తుందని అంచనాలు వున్నాయన్నారు. 23 శాతం జిల్ఆ పరిషత్ ఆస్తులు అభివృద్ధి, , రోడ్డు నిర్వహణ, చిన్న నీటి వనరులు అభివృద్ధి పరుచుట, 12 శాతం అత్యవసర పరిస్ధితులలో త్రాగెనీటికి, 15 శాతం కార్యాలయ నిర్వహణకు, పరికరాలు, సిబ్బంది నిర్వహణకు, 15 శాతం షెడ్యూలు కులముల సంక్షేమ అభవృద్ధి, 6 శాతం  షెడ్యూలు తెగల సంక్షేమ అభివృద్ధికి, 15 శాతం  స్త్రీ య శిశు సంక్షేమవ అభివృద్ధి కి, 4 శాతం అత్యవసర ఖర్చులు, సాంస్కృతిక కార్యక్రమాలు, కోర్టు ఫీజులు, ఉత్సవాలు, పండుగలు వంటి వాటికి, 10 శాతం విభాగాల కార్యకలాపాలు జరుపుటకు, విద్య, ఆరోగ్యం, సంక్షేమ ఇతర శాఖలకు 8 కోట్ల 90 లక్షలు వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. 15 శాతం ఫెడ్యూలు కులాలకు 6 శాతం నిధులను ఇయర్ మార్క్ చేయడం  జరిగిందన్నారు.
పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వీర జవానులకు నివాళులర్పిస్తూ, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు ఒక నెల వేతానాన్ని మరణించిన జవాన్ల కుటుంబాలకు ఇవ్వడానికి సర్వసభ సమావేశం ఏకగ్రీవంగా  తీర్మానించింది. మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ గుత్తా వెంకట సుబ్బయ్య అకాల మరణానికి రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివళులు ఆర్పించారు.  ఈ కార్యక్రమంలో డి.సి.ఎం.ఎస్ ఛైర్మన్ బెల్లం సత్యం, టంగుటూరు ఎం.పి.పి చదలవాడ చంద్రశేఖర్, ఎన్.జి.పాడు ముప్పవరపు వీరయ్య చౌదరి, కందుకూరు శ్రీకాంత్ చౌదరి, తన్నీరు శ్రీనివాసరావు, పల్లెపు ఏడుకొండలు, జడ్పీటిసి విజయ, జిల్లా పరిషత్ పి.సాయిబాబు, గృహ నిర్మాణ శాఖ  సాయినాధ్, ప్రజెక్టు డైరెక్టర్ రవీంద్ర, శ్రీహరిప్రాసాద్ ,  పిడి.రేణుక, జాల్లా విద్యా శాఖ అధికారి  సుబ్బారావు, సి.పి.ఓ శ్రీవెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.