మార్చి 4 నుంచి కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మార్చి 4 నుంచి కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు

రంగారెడ్డి, పిబ్రవరి 14, (way2newstv.com)
కీసర గుట్టలో ప్రతియేటా నిర్వహించే బ్రహ్మోత్సవాలను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయితెలంగాణలోని వివిధ జిల్లాలు, పరిసర మండలాల నుంచి తరలివచ్చే భక్తుల రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 


మార్చి 4 నుంచి కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు

పారిశుధ్యాన్ని మరింత మెరుగు పరచాలని, ఉచిత వైద్య శిబిరాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకై ప్రత్యేక బూత్‌లను ఏర్పాటు చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి  ఆదేశించారు. దర్శనంలో  ఎలాంటి తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఆలయానికి రంగులు వేయడంతో పాటు విద్యుత్ దీపాలంకరణ చేపట్టాలని ఆదేశించారు. కీసర చౌరస్తా నుండి దేవాలయ ఆవరణ వరకు వీధి దీపాలను ఏర్పాటు చేయాలని, ఉత్సవ సంబరాలను ఘనంగా జరుపుకునేలా చూడాలని పేర్కొన్నారు.భక్తుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ బూత్‌లను ఏర్పాటు చేయాలని, నంది నిర్మాణంలో స్వల్ప మార్పులను ఆయన సూచించారు. గర్భగుడి లోపలి నుండి పొగ సజావుగా బయటకు వెళ్లేలా ఎగ్జాస్టింగ్ ఫ్యాన్‌లు ఏర్పాటు చేయాలని కోరారు.