ఆపరేషన్ స్మైల్ లో 2425 మందికి పునరావాసం

హైద్రాబాద్, ఫిబ్రవరి 14, (way2newstv.com)
వీధి బారినపడ్డ అనాథ బాలలను ఆడుకోవటానికి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న ఆపరేషన్ స్మైల్ ఐదవ దశ సత్ఫలితాలను ఇస్తోంది..ఆపరేషన్ స్మైల్ దశ జనవరి 1 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు నిర్వహిరు. 


ఆపరేషన్ స్మైల్ లో 2425 మందికి పునరావాసం

ఆపరేషన్ స్మైల్ దశ జరుగుతున్న సమయం లో గుర్తించిన విషయాలు ఏమిటంటే , ఆశ్రమాల ముందు, రోడ్లపైన బస్ స్టేషన్ లలో మరియు మత పరమైన ప్రదేశాలలో పిల్లలు ఎక్కువ ఉంటున్నట్టు గమనించామని, శిక్షణ పొందిన పోలీస్ అధికారుల చేత దాదాపు 2,425 మంది పిల్లలను కాపాడి వారికీ పునరావాసం కల్పించటం జరిగిందినిఆమె వివరించారు. ఈ విధంగా కాపాడినటువంటి పిల్లల వివరాలను మహిళా మరియు శిశు అభివృద్ధి  మంత్రిత్వ శాఖ యొక్క మిస్సింగ్ చైల్ పోర్టల్ లో పొందుపరచటం జరిగింది.అదే విధంగా గుర్తించినటువంటి పిల్లల యొక్క వివరాలను ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ఇవ్వటం జరిగిందాన్నారు.  తద్వారా పిల్లల యొక్క తల్లిదండ్రులు, బంధువులు మరియు సంబంధిత జిల్లాల పోలీసులు పిల్లలను గుర్తించటానికి అవకాశం ఉంది. ఆపరేషన్ స్మైల్ ఐదవ దశ లో  కాపాడినటువంటి పిల్లల సంఖ్య : 2425 అబ్బాయిలు : 1841,అమ్మాయిలు 584 పిల్లల సంక్షేమ కమిటీ ముందు హాజరు పరిచినటువంటి పిల్లలు 2425 తెలంగాణకి సంబంధించినటువంటి పిల్లలు 2168 ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి పిల్లలు 66 ఉన్నారు.
Previous Post Next Post