ఆలయ సొమ్ములు, భూములు వాడుకుంటున్నారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆలయ సొమ్ములు, భూములు వాడుకుంటున్నారు

విజయవాడ, ఫిబ్రవరి 16, (way2newstv.com
ఇంద్రకీలాద్రిలో కనకదుర్గ అమ్మవారిని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రం లోకి అడుగుపెట్టిన ఎవరికైనా అమ్మవారు స్వాగతం పలుకుతుంది. రాష్ట్ర విభజన తరువాత అమ్మవారి దగ్గరకి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. అమ్మవారికి విశిష్టమైన పూజలు, చక్కని దర్శనం ఇక్కడి వైదికులు,ఈఓ కొటేశ్వరమ్మ అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆలయాలన్ని సమాజానికి ఎంతో ఉపకారం చేస్తాయి. 


ఆలయ సొమ్ములు, భూములు వాడుకుంటున్నారు

భగవంతుని దర్శనానికి అన్ని చోట్ల నుంచి వస్తారు. ఆలయాలు ఇప్పుడు ఏర్పడినవి కావు .ప్రాచీన కాలం నుండే ఇవి ఉన్నాయి. ఆలయాల్లో విద్య,వైద్య,కళా సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. దేవాలయానికి సంబందించిన భూముల్ని ఎవరు ముట్టుకోకూడదు అన్న వాదన ఎప్పటి నుంచో ఉందని అన్నారు. ఇప్పుడు ఏది కావాలన్న ముందు దేవాలయాల సొమ్ము, భూముల్ని వాడుకుంటున్నారు. ఇది పాలకులకు అంత క్షేమకరం కాదు. ఆలయాల్లో ఉచిత అన్నదానం పెట్టారని అన్నారు. కానీ అది సరిఅయిన క్రమ పద్ధతిలో జరగటం లేదు. నివేదన,ప్రసాదాలు ఎలా తయారు చేస్తారో అన్నదాన ప్రసాదం అలా తయారు చేయాలి. ఈఓ పిలవటంతో అమ్మవారిని ఆహ్వానించటానికి భీష్మ ఏకాదశి రోజున ఇంద్రకీలాద్రికి రావటం జరిగిందని అన్నారు. భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయన కార్యక్రమాన్ని చేపట్టామని అయన అన్నారు.