ద్వి చక్ర వాహన దారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ద్వి చక్ర వాహన దారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి

జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్
- రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆర్టీఏ ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీ
సిద్ధిపేట, ఫిబ్రవరి 12: (way2newstv.com
ప్రతి ద్వి చక్ర వాహన దారుడు హెల్మెట్ పెట్టుకుని వాహనాన్ని నడపాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రజలను కోరారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఆర్టీఏ కార్యాలయం నుంచి పట్టణంలోని ముస్తాబాద్ సర్కిల్ వరకూ మంగళవారం ఉదయం 30వ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని ఆర్టీఏ శాఖ ఆధ్వర్యంలో పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్ తో కలిసి జిల్లా కలెక్టర్ హెల్మెట్ వాహన ర్యాలీని చేపట్టారు.


 ద్వి చక్ర వాహన దారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి 

 ఆర్టీఏ జిల్లా అధికారి రామేశ్వర్, సిద్ధిపేట ఏసీపీ రామేశ్వర్ జెండా ఊపి హెల్మెట్ ర్యాలీని ప్రారంభించారు. వాసవి క్లబ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో 30వ రోడ్డు భద్రత వారోత్సవాలపై కరపత్రాలను జిల్లా కలెక్టర్, సీపీలు ఆవిష్కరించారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్ నడిపే ద్విచక్ర వాహనం పై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కూర్చుని హెల్మెట్ ధరించి హెల్మెట్ ర్యాలీలో పాల్గొన్నారు. వీరి వెంట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, పోలీసు అధికారిక యంత్రాంగం, ఆర్టీఏ శాఖాధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.