భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ సేవలందించిన శ్రీవారి సేవకులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ సేవలందించిన శ్రీవారి సేవకులు

తిరుపతి, ఫిబ్రవరి 12 (way2newstv.com):  
రథసప్తమిని పురస్కరించుకొని టిటిడి అనుబంధ ఆలయాలలో వాహన సేవలు వీక్షించేందుకు విచ్చేసిన వేలాది మంది  భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ శ్రీవారి సేవకులు విశేష సేవలందించారు.   


భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ సేవలందించిన శ్రీవారి సేవకులు

దాదాపు 280 మంది శ్రీవారి సేవకులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాలలో అన్నప్రసాదం, ఆరోగ్యశాఖ, విజిలెన్స్ విభాగాలకు సంబంధించిన వివిధ ప్రాంతాలలో భక్తులకు సేవలందించారు. మంగళవారం ఉదయం నుండి మాడ వీధులలో వేచి ఉండే భక్తులకు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. 
 టి.టి.డి హిందూధర్మ ప్రచార పరిషత్ ముద్రించిన రథసప్తతమి, గోవిందనామాలు, సుప్రభాతం, లలితాసహస్రనామం, విష్ణు సహస్రనామం పుస్తక ప్రసాదాలను కూడా శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అందిస్తున్నారు.