టెక్నాలజీతో అక్రమ మైనింగ్ కు చెక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టెక్నాలజీతో అక్రమ మైనింగ్ కు చెక్

ఒంగోలు, పిబ్రవరి15, (way2newstv.com)
టెక్నాలజీని వినియోగించుకుంటూ అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న మైనింగ్ ఆక్రమణలేమైనా వుంటే పర్యవేక్షించే విధానాలపై ఫారెస్టు సెక్షన్ అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. తరగతి గదుల్లో సెక్షన్ అధికారులకు పాఠాలు చెప్పడమే కాకుండా ఇటువంటి అంశాలపై క్షేత్ర స్థాయిలో తెలియజేసేందుకు ఏపీ ఫారెస్టు అకాడమీలో శిక్షణ పొందుతున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారులకు అధ్యయన యాత్రను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మూడవ బ్యాచ్ ఫారెస్ట్ సెక్షన్ అధికారుల అధ్యయన యాత్ర నిర్వహిస్తున్నారు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ ఎంవీ ప్రసాదరావు సారధ్యంలో శిక్షణ పొందుతున్న 30 మంది ఈ అధ్యయన యాత్రకు బయలుదేరి వెళ్ళారు. 

 టెక్నాలజీతో అక్రమ మైనింగ్ కు చెక్

ఫారెస్టు సెక్షన్ అధికారుల శిక్షణలో భాగంగా తరగతి గదుల్లో అభ్యసించిన ప్రతీ అంశాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి గ్రహించేందుకు వీలు కలిగేలా అధ్యయన యాత్ర షెడ్యూల్‌ను నిర్ణయించామన్నారు. ప్రతీ బ్యాచ్‌కు ప్రభుత్వం ఎంతో వ్యయప్రయాసలతో నిర్వహిస్తున్న ఈ అధ్యయనాన్ని ప్రతి ట్రైనీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అన్నవరం కొండను హరితీకరించడంలో భాగంగా చేపట్టిన పవిత్ర వనం ప్రాజెక్టును సందర్శించడంతో యాత్ర మొదలవుతుందని చెప్పారు. ఏటికొప్పాక బొమ్మల తయారీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులు తెలుసుకుంటారన్నారు. అనంతరం విశాఖలోని జూను పరిశీలిస్తారని, కంబాలకొండ ప్రాంతంలోని ఎకో టూరిజం ప్రాజెక్టును పరిశీలిస్తారన్నారు.విజయనగరం జిల్లాలో మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల ఆక్రమణను ఐటి పరిజ్ఞానం సహాయంతో నిరోధించే పద్ధతులు తెలుసుకుంటారని డైరెక్టర్ మూర్తి వివరించారు. ఎస్ కోట, అనంతగిరి ప్రాంతాల్లో కాఫీ, మిరియం తోటల సందర్శన వుంటుందన్నారు. హార్వెస్టింగ్, సిల్వికల్చర్ పద్ధతుల్లో మెళకువలను అధ్యయనం చేస్తారన్నారు. బొర్రా గుహలు, అరకు ప్రాంతాల్లో ప్రాకృతిక నిర్మాణాలను పరిశీలిస్తారన్నారు. పాడేరులో భూమి కోత నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన పనులను పరిశీలిస్తారని, అనంతరం చింతపల్లిలో డిఎఫ్‌ఓలతో చర్చా గోష్టి అనంతరం కాఫీ తోటలు, పాక్షిక సతత హరితారణ్యాల సందర్శన, అక్కడ నుంచి సప్పరాల ప్రాంతాన్ని సందర్శిస్తారన్నారు. సీలేరులో హైడ్రో పవర్ ప్రాజెక్టును, మోతుగూడెంలో పొల్లూరు జలపాతాన్ని సందర్శిస్తారని, టేకు హార్వెస్టింగ్‌లో ప్రయోగాలు నిర్వహిస్తారన్నారు. అనంతరం చింతూరు మీదుగా భద్రాచలం వెళ్ళి ఐటీసీ పేపర్ పరిశ్రమను చూస్తారని, అమరవరం, కుకునూరు, దూబచర్ల ఏరియాల్లో యూకలిప్టస్, వెదురుతో సహా వివిధ జాతుల ప్లాంటేషన్, హార్వెస్టింగ్‌పై అధ్యయనం చేస్తారు