ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్

కర్నూలు, ఫిబ్రవరి 23,  (way2newstv.com)
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. శనివారం కర్నూలు శివారులో ఉన్న ఉల్చాల రోడ్డులోని సీడ్ గోదాములో విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల మోటరైజెడ్ హోండా యాక్టీవ్ వాహనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సకలాంగులకు ధీటుగా విభిన్న ప్రతిభావంతులు నేడు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారన్నారు. ఒక్కొక్కటి రూ.85 వేలు విలువైన మూడు చక్రాల మోటరైజెడ్ హోండా యాక్టీవ్ వాహనాలను 21 మంది విభిన్న ప్రతిభావతులకు ఆయన అందించారు. 


 ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్ 

ధర్మబద్ధంగా జీవిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు పాశుపతాస్త్రమని అన్నారు. మీకందరికీ ఓటు ఉందా అని అడిగి, లేకపోతే వెంటనే నమోదు చేసుకోవాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూతు స్థాయి అధికారులు ఉన్నారని ఫారం 6 ద్వారా మీరు ఓటును నమోదు చేసుకోవాలన్నారు. భారత ఎన్నికల సంఘం 1950 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసిందని ఓటు వివరాలను తెలుసుకునేందుకు జిల్లా వాసులు 08558 - 1950 ఫోన్ చేయాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సాంచాలకులు భాస్కర్ రెడ్డి, సమాచార శాఖ డిఈఈ బాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.