ఈవీఎంలపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: చంద్రబాబు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఈవీఎంలపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 14, (way2newstv.com
ఈవీఎంలపై సుప్రీంకోర్టుకు వెళ్తామని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. గురువారం అయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీపై వ్యతిరేకత ఉన్నా ఈవీఎంలను మేనేజ్ చేసే అవకాశముందని సీఎం తెలిపారు.చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందే బీజేపీయేతర పక్షాల కూటమి రెడీ అవుతుందన్నారు. కామన్ మినిమం ప్రోగ్రామ్తో ముందుకెళ్తామన్నారు. అధిక స్థానాలు గెలిచిన పార్టీని రాష్ట్రపతి పిలిచే అవకాశం ఉందని సీఎం చెప్పుకొచ్చారు. 


ఈవీఎంలపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: చంద్రబాబు 

బీజేపీకి మెజార్టీ రాకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే ఉద్దేశంతోనే ఎన్నికల ముందు బీజేపీయేతర పక్షాల కూటమి పొత్తు ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం నేను పోరాడుతున్నాను. 5కోట్ల ప్రజల హక్కుల కోసం ధర్మపోరాటం చేస్తున్నాం. బిజెపి,వైసిపి,టిఆర్ ఎస్ మాత్రం కుట్రలు చేస్తున్నాయి. నన్ను దొంగ దెబ్బతీయాలని చూస్తున్నారు.  కుట్రలు, ప్రలోభాలు, బెదిరింపులే వాళ్ల రాజకీయం. అవకాశ వాదులకు టిడిపిలో స్థానంలేదు. కొందరు పోతే నష్టాలకన్నా లాభాలే మిన్న.  నాయకులు రావడం,పోవడం మామూలే. కానీ కార్యకర్తలే టిడిపిని కాపాడుకుంటారని అన్నారు. 
ఆశయం కోసం పనిచేసేది కార్యకర్తలే.  కులముద్ర నాపై వేయాలని చూడటం దారుణం. విద్యార్ధి దశనుంచి నన్ను గౌరవించింది ఇతర కులాలే. నన్ను గౌరవించింది బిసి,ఎస్సీ,ఎస్టీ,ముస్లిం మైనారిటిలే. కాపులకు రిజర్వేషన్లని చెప్పి మోసగించింది వైఎస్. 
కాపు రిజర్వేషన్లపై సంబంధం లేదంది జగన్మోహన్ రెడ్డి. కాపులకు ఏడాదికి రూ.1000కోట్లు పెట్టాం. ఈబిసి రిజర్వేషన్లలో 5% కాపులకే ఇచ్చాం. ఇచ్చినమాట నిలబెట్టుకుంది టిడిపినే. వైసిపి కులాలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తోంది. మోది,జగన్,కెసిఆర్ ఆడే కుట్రలు ఇవని అన్నారు. *ఏపికి హోదా కోసం చిదంబరం కమిటి సిఫారసు చేసింది. హోదా ఇవ్వాలని హోం పార్లమెంటరీ కమిటి నివేదిక. ఏపికి హోదాపైనే తొలి సంతకం అని రాహుల్ చెప్పారు. వీటిపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించరని అన్నారు. హోదా ఇస్తామన్న వారిని విమర్శిస్తాడు. హోదా ఎగ్గొట్టిన మోదిపై నోరు తెరవడు. ఏపికి 22పార్టీలు మద్దతిస్తే వైసిపి స్వాగతించదు. కెసిఆర్ తో కలిసి కుట్రలు చేస్తారు. ఫెడరల్ ఫ్రంట్ డ్రామాలు ఆడతారు 5ఏళ్లు హైదరాబాద్ వదిలి రాలేదని అన్నారు. వీటన్నింటిపై ప్రజల్లో చర్చ జరగాలి. కసి,పట్టుదల ప్రజల్లో పెరగాలి. కుట్రదారులకు బుద్ది చెప్పాలి. టిడిపి ధర్మపోరాటానికి అండగా ఉండాలి. అన్ని సీట్లలో టిడిపి గెలుపు పోందాలని అన్నారు.