మౌలిక వసతులకు పెద్ద పీట - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మౌలిక వసతులకు పెద్ద పీట

నెల్లూరు, ఫిబ్రవరి 14, (way2newstv.com
రాష్ట్రంలోని 110 మునిసిపాలిటీల్లో ను మౌలిక వసతులకు పెద్దపీట వేశాం. నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పైపులైను, రోడ్ల నిర్మాణం పనులు మార్చి నెలాఖరుకు పూర్తవుతాయి. స్వర్ణాల చెరువు కట్టపై నెక్లస్ రోడ్డు ను గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ వివరించారు.  గురువారం అయన మీడియాతో మాట్లాడారు. మూలస్థానం శివాలయం కోనేరు ఆధునీకరణ, రంగనాథ స్వామి ఆలయం వద్ద ఘాట్ నిర్మాణం, ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం వద్ద ఘాట్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. నవాబుపేట శివాలయం తెప్పోత్సవం ఘాట్ ను పూర్తి చేశాం. 


మౌలిక వసతులకు పెద్ద పీట

బారా షహీద్ దర్గా వద్ద ప్రార్ధన మందిరం, షాది మంజిల్ పనులు పురోగతిలో ఉన్నాయి. బీసీ భవన్, కాపు వంటి కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. రంగనాయకుల పేటలో దోబీ ఘాట్, సోమ శిఖా పురం రజక సంఘంలో కర్మ క్రతువుల ఏర్పాట్లు కొరకు పనులు జరుగుతున్నాయని అన్నారు. గడియారం సెంటర్ వద్ద వీరబ్రహ్మేంద్రస్వామి గుడి, వీఆర్ కళాశాల సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. నగరంలో 80 పార్కులను ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, ప్లే ఎక్విప్మెంట్ వంటి సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నాం. నగర కార్పొరేషన్ పరిధిలోని పేదలకోసం 49 వేల ఇళ్లు నిర్మిస్తున్నాం. ఇప్పటికే 23 వేల ఇళ్ల ను లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించామని అన్నారు. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా 4807 లకు గృహప్రవేశ లను ఘనంగా నిర్వహించాం. అవినీతికి, అక్రమార్జనకు కేరాఫ్ ఎడ్రస్ జగన్. జగన్ పంచన చేరి కొందరు అవినీతి గురించి మాట్లాడటం క్రూర మృగాలు అహింస గురించి మాట్లాడినట్లు గా ఉందని ఆరోపించారు. చిత్తశుద్ధితో పనిచేసే నాయకులకు మాత్రమే ప్రజాదరణ ఉంటుందని చరిత్ర నిరూపించిందని మంత్రి అన్నారు.