విజయవాడ ఫిబ్రవరి 5 (way2newstv.com)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు కోల్ కతా బయల్దేరారు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన అనంతరం విజయవాడ నుంచి విమానంలో కోల్ కతాకు బయల్దేరి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని వీరు కలవనున్నారు.
కోల్ కతాకు బయల్దేరిన చంద్రబాబు
ఆమె చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు సంఘీభావం తెలపనున్నారు. మమతతో దీక్షను విరమింపజేసే అంశంపై చర్చించనున్నారు. మరోవైపు, మమత దీక్షకు బీజేపీయేతర పక్షాల నుంచి మద్దతు లభిస్తోంది.
Tags:
political news