రాంపూర్ లో కనువిప్పు

చేర్యాల, ఫిబ్రవరి 05 (way2newstv.com) 
సిద్దిపేట్ పోలీసు కమీషనర్ ఆదేశాలతో 
సోమవారం రాత్రి చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో  రాంపూర్ గ్రామంలో*   పోలీస్  కళా బృందం కళా ప్రదర్శన *కనువిప్పు* అనే కార్యక్రమం  ద్వారా మూఢనమ్మకాలు,  మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలు, కుటుంబ కలహాలు గురించి, పేకాట ఆడడంతో  కుటుంబలో జరుగుతున్న పరిణామాలను, వరకట్నం వలన జరుగుతున్న సంఘటనలు గురించి, ఈమధ్య జరుగుతున్న ఆత్మహత్యలు గురించి,  వృద్ధులైన తల్లిదండ్రులను మంచి చూసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ , షీ టీమ్స్  గురించి కళాబృందం సభ్యులు బాలు, రాజు, మల్లు, రవీందర్, తిరుమల, పాటల రూపంలో మరియు నాటకం రూపంలో గ్రామ ప్రజలను  చైతన్య పరచినారు.  


 రాంపూర్ లో కనువిప్పు 

ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసిపి మహేందర్ చేర్యాల సిఐ రఘు, ఎస్ఐ మోహన్ బాబు లు  పాల్గొని ఈ సందర్భంగా వారు   నేను సైతం అనే కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజల ప్రజాప్రతినిధుల గ్రామ పెద్దల సహకారంతో చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది సీసీ కెమెరాల పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు తగ్గుముఖం  పట్టాయన్నారు. వాహన దారులు తప్పకుండా  వాహనానికి  రాష్ట్ర రవాణా శాఖ  నిర్దేశించిన ప్రకారం ఈనెల 10 తారీకు లోపు నెంబర్ ప్లేట్ బిగించు కోవాలని తరువాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినారు* మరియు తాగి డ్రైవింగ్ చేయవద్దని,  లైసెన్స్  లేకుండ వాహనాలు నడపవద్దని ,హెల్మెట్  వాడకం.గురించి  తెలిపారు, మరియు అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలిపారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వున్న పోలీసు  స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు, గ్రామంలో ఎవరు మద్యం బెల్టు షాపులను  నడపవద్దని, గుట్కాలు అమ్మ వద్దని తెలిపారు, చిన్న చిన్న తగదలకు పోయి జీవితం నాశనము చేసుకొవద్దని తెలిపారు, నేరరహిత  గ్రామలుగా చేయడానికి కృషి చేస్తామని తెలిపారు,  మరియు వృద్దలైన తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులు మంచిగా చూసుకోవాలి అని తెలిపారు. మంత్రలు తత్రాలు ముడనమ్మకాలు నమ్మవద్దని వాటి గురించి వారి దగ్గరకు వీరి దగ్గరకు తిరిగి డబ్బులు ఖర్చు చేసి అప్పులపాలు కావద్దని ప్రజలకు  తెలిపారు,
Previous Post Next Post