.మీ పై మీరు నమ్మకం కలిగి ఉండాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

.మీ పై మీరు నమ్మకం కలిగి ఉండాలి

పదవ తరగతి ఫలితాల్లో జిల్లా నెంబరు వన్ సాధించాలి
- విద్యార్థులకు నిర్వహించిన ప్రేరణ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ వెల్లడి
సిద్ధిపేట, ఫిబ్రవరి 12:(way2newstv.com) పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించేందుకు ముందుగా విద్యార్థులైన మీపై మీకు నమ్మకం ఉండాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ విద్యార్థినీ, విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. సిద్ధిపేట జిల్లా ములుగు మండలంలోని లక్ష్మక్క పల్లి గ్రామంలోని పీపీజే ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఉదయం విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి, రోటరీ క్లబ్ సంయుక్తంగా ములుగు, మర్కూక్, వర్గల్ మండలాల్లోని పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ అవగాహన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 


.మీ పై మీరు నమ్మకం కలిగి ఉండాలి 

ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రేరణ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పదవ తరగతి ఉత్తీర్ణత శాతం బాగా రావాలని, ఆ దిశగా విద్యార్థులలో ఉత్సాహాన్ని, ప్రేరణను కల్పించేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని సూచించారు. విద్యార్థులను ఉద్దేశించి మూడు రకాలుగా ఉంటారని ఆయా అంశాలను వివరిస్తూ.. మొదట బాగా చదువుకునే విద్యార్థులు ఉంటారని.. వారిలో పైకి ఎదగాలనే భావన ఉండటంతో పాటు భయం ఉంటుందని.., వారు ఆ భయాన్ని ఆ ఒత్తిడిని తొలగించుకోవాలని కోరారు. రెండవ రకంలో ఏదో పదవ తరగతి పరీక్షలు వరకే చదివేద్దామనుకునే వారు., అప్పటికే వారి మైండ్ లో ప్రిపేర్ అయి ఉండవచ్చు అనుకుంటారని.., ఈ పరీక్షల వరకే చదువుదామని అనుకోవద్దని ఆ రెండవ రకం విద్యార్థులకు సూచనలు చేశారు. ఇక మూడవ రకం.. నేను పదవ తరగతి పాస్ అవుతానో.. లేదోనని అనుకునే వారుంటారని.., వారి కోసమే ఈ ప్రేరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మూడవ రకం వారికి మనో ధైర్యం నింపుతూ.. ముందు మీ పై మీకు నమ్మకం కలిగి ఉండాలని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్రంలోనే సిద్ధిపేట జిల్లా నెంబరు వన్ స్థానంతో ఉండాలని కోరుతూ.. ప్రతి ఒక్కరూ పాస్ కావడమే కాదు.. మంచి గ్రేడింగ్ శాతం సాధించాలని, ముఖ్యంగా మూడవ రకం విద్యార్థినీ, విద్యార్థులు పాస్ అవుతామో.. లేదోననే భాధను వీడి పట్టుదలతో చదివి మార్కులు 60 నుంచి 80 శాతం మార్కులు సాధించాలని కోరారు. మీరంతా బాగా చదవాలనే అదనపు తరగతులను నిర్వహిస్తూ.. అదనపు సమయంలో మీకు కావాల్సిన స్నాక్స్ ఇస్తూ ప్రభుత్వం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు. అంతకు ముందు వ్యక్తిత్వ వికాస నిపుణులు వీరేందర్ మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షలనీ ఆందోళన, భయం పెట్టుకోవద్దని, విద్యార్థులు తమ మానసిక ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం సులభంగా సాధించవచ్చని చక్కని ఉదాహరణలతో విద్యార్థులకు వివరిస్తూ.. వారిలో ప్రేరణ కలిగించారు. అంతకు ముందు మండల ప్రత్యేక అధికారి, మండల అధికారులు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మర్కూక్ మండల ప్రత్యేక అధికారి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని మండలాల విద్యాధికారులు, పలు మండలాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.