బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో హెచ్‌సీఎల్‌ ఐటి టవర్

గుంటూరు, ఫిబ్రవరి 27 (way2newstv.com)
దేశంలోనే నాలుగో అతి పెద్ద సర్వీసెస్ కంపెనీ హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ ఆంద్రప్రదేశ్ లో తన బ్రాంచ్ ను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే... అమరావతి రాజధాని ప్రాంతంలో, గన్నవరం దగ్గర కేసరపల్లిలో ఎల్‌అండ్‌టీ హై టెక్‌ సిటీ పక్కన ఇప్పటికే హిందుస్థాన్‌ కార్పొరే షన్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) కు ప్రభుత్వం భూమి కూడా అప్పగించింది, శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలు పెట్టారు. తాత్కాలికంగా మేధా టవర్స్ లో కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టులో హెచ్‌సీఎల్‌ రూ.750 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. తద్వారా 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.



 బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో హెచ్‌సీఎల్‌ ఐటి టవర్

కళంకారీ నేత, కొండపల్లి బొమ్మలను ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో ఈ నూతన భవంతుల్ని నిర్మించనున్నారు.హెచ్‌సీఎల్‌ కార్యకలాపాలు ప్రారంభించనున్న నేపథ్యంలో, స్థానిక యువత ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది. స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తామని ఇప్పటికే హెచ్‌సీఎల్‌ యాజమాన్యం ప్రకటించింది. మారో పక్క శాశ్వత భవనాలు కోసం, కళంకారీ నేత, కొండపల్లి బొమ్మలను ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో హెచ్‌సీఎల్‌ ఐటి టవర్ నిర్మాణం జరగనుంది.. గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్న ఈ భవనాలను విమానాలు దిగే సమయంలో ఆకాశంలో నుంచి చూస్తే ఈ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయి. 2019 చివరి నాటికి రాష్ట్రంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నూతన క్యాంపస్ కొలువుదీరుతుందని, ఇప్పటికే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత, ఐటీ దిగ్గజం శివనాడార్ చెప్పారు... మరో పక్క, గన్నవరంలోనే కాక, అమరావతిలో కూడా మరో ఐటి టవర్ నిర్మించేందుకు హెచ్‌సీఎల్‌ ప్రణాలికలు రూపొందిస్తుంది
Previous Post Next Post