మాట నిలబెట్టుకోని ప్రధాని మోడీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మాట నిలబెట్టుకోని ప్రధాని మోడీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (way2newstv.com
దేశ ప్రధాని హోదాలో ఇచ్చిన  హామీని నిలబెట్టుకుని తీరుతారని ఎవరైనా భావిస్తారనీ, అయితే మోడీ హామీని నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వియర్శించారు. సోమవారం ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్షలో ఆయన పాల్గొన్నారు. దీక్షకు మద్దతు పలికారు. రాహుల్ మాట్లాడుతూ చంద్రబాబు దీక్షా వేదికపై నుంచి ఆయన మాట్లాడుతూ…మోడీ ఎక్కడకు వెళితే అక్కడ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. మాట నిలబెట్టుకోని ప్రధాని మోడీ 

ఏపీ విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందన్నారు.  ప్రధాని అవినీతి పరుడని, రాఫెల్ ఒప్పందలో ఆయన చేసిందేమిటో హిందూ జాతీయ దినపత్రిక పేర్కొందని చెప్పారు. చోకీదార్ దొంగగా మారారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సిన సొమ్ములను ఎగ్గొట్టి వాటిని తన మిత్రుడు అనిల్ అంబానీకి ఇచ్చారని రాహుల్ అన్నారు. ప్రధాని ఎక్కడికి వెళితే అక్కడి పాట పాడతారని ధ్వజమెత్తారు. ఏపీకి వెళ్తే హోదా ఇవ్వకుండా అబద్ధాలు చెబుతారని విమర్శించారు. ప్రధాని మోదీకి విశ్వసనీయత లేదని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు.