హైదరాబాద్, ఫిబ్రవరి 27(way2newstv.com)
భారత్, ఆస్ట్రేలియాల మధ్య విద్య, వ్యవసాయం, శిక్షణ, ఐటి తదితర రంగాలలో సహకారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. బుధవారం సచివాలయంలో నార్తర్న్ టెరిటరీ విద్యాశాఖా మంత్రి సెలినా యూబో ఆస్ట్రేలియన్ బృందంతో డా.ఎస్.కె.జోషి ని కలిసారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఆస్ట్రేలియా, భారత్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్య, ఉపాధి శిక్షణ, వ్యవసాయం, టూరిజం, ఐటి తదితర రంగాలలో సహకారానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఈ విధంగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేయడానికి తగు కార్యాచరణను రూపొందించవలసి ఉందని అన్నారు.భారత్, ఆస్ట్రేలియాల మధ్య విమాన సర్వీసులను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ఆస్త్రేలియా బృందంతో సీఎస్ చర్చలు
విద్యకు సంబంధించి ఆస్ట్రేలియా తోడ్పాటు అధ్యాపకుల మార్పిడి, శిక్షణ, పాఠ్యంశాల కూర్పు, విద్యార్ధుల శిక్షణ, విద్యార్ధుల ఎక్సేంజ్ తదితర రంగాలలో అవకాశాలున్నాయన్నారు. వీ హబ్ ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నారన్నారు. స్టార్ట్ అప్ రంగంలో సహకారానికి అవకాశం ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన శిక్షణను అందించడంలో సహకారం అందించాలన్నారు. సాంకేతిక విద్యాకమీషనర్ నవీన్ మిత్తల్ మాట్లాడుతూ ఇంజనీరింగ్, నర్సింగ్, నైపుణ్యత, అన్ లైన్ విద్య లో తదితర రంగాలలో సహకారానికి అవకాశాలున్నాయన్నారు. నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని, పలురంగాలలో ఆస్ట్రేలియా సహకారంతో ముందుకు వెళ్ళటానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
నార్తర్న్ టెరిటరీ విద్యాశాఖా మంత్రి సెలినా యూబో మాట్లాడుతూ ఆస్ట్రేలియా, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివిధ రంగాలలో సహకారానికి సిధ్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పలురంగాలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ముఖ్యమైన రంగాలలో అవగాహన ఒప్పందానికి అవసరమైన అంశాలను తయారు చేసేలా కృషి చేస్తామన్నారు.
Tags:
telangananews