న్యూ డిల్లీ ఫిబ్రవరి 27(way2newstv.com)
పుల్వామా ఉగ్రఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భారత్ పై పాకిస్థాన్ ప్రభుత్వం ఆగ్రహంతో రగిలిపోతుంది. మెరుపుదాడులతో భారత్ వ్యవహరించిన తీరుపై ఇమ్రాన్ ప్రభుత్వం బదులు తీర్చుకోవాలని అదనుకోసం వేచి చూస్తుంది. భారత్ జరిపిన మెరుపుదాడులపై కుతకుతలాడుతున్న పాక్.. అంతర్జాతీయ మద్దతు లేనప్పటికీ భారత గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాల్ని ప్రవేశించేలా చేయటం.. భారత యుద్ధ విమానాల రంగప్రవేశంతో తోక ముడిచి పోవటం లాంటి తాజా ఘటనలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని మరింత పెంచుతున్నాయి.పాక్ కు యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు లేవన్న మాట సర్వత్రా వినిపిస్తున్న వేళ.. ఇమ్రాన్ ప్రభుత్వంపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోండి. భారత్ కు తగు రీతిలో సమాధానం చెప్పకుంటే తన పరపతి భారీగా దెబ్బ తింటుందని ఇమ్రాన్ భావిస్తున్నారు.
ప్రతీకారేచ్చలో పాక్... ఎన్ సి అథారిటీతో పాక్ ప్రధాని భేటీ?
పాక్ ప్రభుత్వాన్ని ఆడించే పాక్ సైన్యం ఇమ్రాన్ మీద ఒత్తిడికి పెద్ద ఎత్తున పెంచుతోండి.మరోవైపు.. భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాల్ని తాము కూల్చివేశామని.. ఒక పైలెట్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా పాక్ ప్రకటించిన నేపథ్యంలో.. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.ఇదిలా ఉండగా.. మరో కీలక అంశం బయటకు వచ్చింది . పాకిస్థాన్ లోని అత్యున్న నిర్ణాయక సంస్థగా పేరున్న నేషనల్ కమాండ్ అథారిటీతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భేటీ కానున్నారు. అణ్వాయుధాల ప్రయోగం.. వినియోగం.. మోహరింపు.. అణ్వాయుధాల పరిశోధన.. అభివృద్ధి.. తదితర అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే కమిటీతో ఇమ్రాన్ భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి.. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? దీనికి భారత సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి. ఏమైనా.. గతానికి భిన్నంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా వాతావరణం కనిపిస్తుందని చెప్పక తప్పదు. ఏమైనా.. దేశం యావత్తు అలెర్ట్ గా ఉండాల్సిన సమయం వచ్చేసిండి.
Tags:
all india news