సహకారం సంతకెళ్లింది.. (శ్రీకాకుళం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సహకారం సంతకెళ్లింది.. (శ్రీకాకుళం

శ్రీకాకుళం, ఫిబ్రవరి 6 (way2newstv.com): థమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (పీఏసీఎస్‌లు) ధాన్యం కొనుగోలుకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. దీంతో సంఘాలు ఈ వ్యాపారానికి ఆసక్తి చూపడం లేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు తరలించేందుకు నానాతంటాలు పడుతున్నారు. మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో రైతుల నుంచి కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారు. సంఘాల్లో నిల్వ సామర్థ్యం లేకపోవడమూ ఇందుకు ఒక కారణం.
జిల్లాలో ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు 59 సంఘాలకు అవకాశం కల్పించారు. వీటిలో 54 సంఘాలు ఇప్పటికే వ్యాపారాన్ని ప్రారంభించాయి. ఇప్పటివరకు 16,771 మంది రైతుల నుంచి 1,80,413 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం ఇప్పటికి 315 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశారు. గతేడాదితో పోల్చితే అమ్మకాల సంఖ్య పెరిగింది. గతేడాది రూ.300 కోట్లు కొనుగోళ్లు జరిగాయి. ఫిబ్రవరి వరకు సమయం ఉన్నందున అమ్మకాలు పెరిగే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.


సహకారం సంతకెళ్లింది.. (శ్రీకాకుళం)

సొసైటీల్లో డిసెంబరు నెలలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రధానంగా మిల్లులతోనే సమస్య ఎదురవుతోంది. తిత్లీ, పెథాయ్‌ తుపాన్ల ప్రభావం, వెలుగు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో మిల్లుల్లో నిల్వలు పేరుకుపోయాయి. దీంతో అక్కడ నిల్వలు ఖాళీ అయితే సొసైటీలు కొనుగోలు చేసినవి తీసుకోని పరిస్థితి ఉంది. మిల్లర్లకు 1:4 నిష్పత్తిలో బ్యాంకు గ్యారంటీలకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడం ప్రతిబంధకంగా మారుతోంది.

సంఘాల్లో ప్రధానంగా నిల్వ సామర్థ్యం లేకపోవడం లోపంగా నిలుస్తోంది. సొసైటీల్లో గతంలో గోదాములు నిర్మించినా వాటి సామర్థ్యం వంద టన్నులకే పరిమితమవుతోంది. దీంతో ధాన్యం నిల్వచేసే పరిస్థితి లేదు.  కొన్ని సంఘాలు హమాలీలను వినియోగిస్తున్నాయి. వీరికి ఛార్జీలు ఇవ్వడం లేదు. సొసైటీలే భరించాల్సి వస్తోంది.  సంఘాలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి. వీటికయ్యే రవాణా ఛార్జీలు మిల్లులు ఇవ్వడం లేదు.

జిల్లాలో అయిదు సంఘాలు కొనుగోళ్లు ప్రారంభించలేదు. వీటిలో బాడంగి, కురుపాం, అంటిపేట, గెద్దలుప్పి, ఆర్‌.వెంకటంపేట సంఘాలున్నాయి. బొబ్బిలి మండలం చింతాడ సొసైటీ జిల్లాలో అతితక్కువగా కొనుగోలు చేసింది. ఏడుగురు రైతుల నుంచి 41.2 మెట్రిక్‌ టన్నులు 0.07 లక్షలకు మాత్రమే కొనుగోలు చేసింది. రూ.కోటిలోపు అమ్మకాలు జరిగిన సొసైటీల్లో కోమటిపల్లి రూ.17 లక్షలు, జామి మండలం అన్నంరాజపేట రూ.53 లక్షలు, బీజేపురం రూ.66 లక్షలు, గలావిల్లి రూ.93 లక్షలు అమ్మకాలు జరిగాయి. మిగిలిన సంఘాల్లో కోటిపైగా అమ్మకాలు చేశారు. కొన్ని సంఘాలు ధాన్యం వ్యాపారంతో అధికలాభాలు అర్జిస్తున్నాయి. కొనుగోలుతో వచ్చిన మార్జిన్‌లో సొసైటీకి రెండుశాతం మొత్తం దక్కుతుంది. అందుకే ప్రత్యేక దృష్టిపెడుతున్నాయి. జిల్లాలో ఎనిమిది సంఘాలు రూ.పది కోట్లకు పైగా కొనుగోళ్లు చేశాయి. ఈ నెల 24 వరకు చూసుకుంటే జిల్లాలో గజపతినగరం సొసైటీలో అత్యధికంగా రూ.28.77 కోట్ల కొనుగోళ్లు జరిగాయి.