మంగళవారం దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మంగళవారం దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల, ఫిబ్రవరి 4 (way2newstv.com):
టిటిడికి అనుబంధంగా ఉన్న కడప నగరంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీ మంగళవారం సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.


 మంగళవారం దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : 
తేదీ   ఉదయం   రాత్రి 
06-02-2019(బుధవారం)    ధ్వజారోహణం చంద్రప్రభ వాహనం
07-02-2019(గురువారం)    సూర్యప్రభవాహనం   పెద్దశేష వాహనం
08-02-2019(శుక్రవారం)    చిన్నశేష వాహనం సింహవాహనం
09-02-2019(శనివారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం
10-02-2019(ఆదివారం)    ముత్యపుపందిరి వాహనం గరుడ వాహనం 
11-02-2019(సోమవారం)   కల్యాణోత్సవం           గజవాహనం
12-02-2019(మంగళవారం) రథోత్సవం ధూళి ఉత్సవం
13-02-2019(బుధవారం) సర్వభూపాల వాహనం అశ్వ వాహనం
14-02-2019(గురువారం)   వసంతోత్సవం, చక్రస్నానం            హంసవాహనం, ధ్వజావరోహణం
15-02-2019(శుక్రవారం) స్నపనతిరుమంజనం పుష్పయాగం
ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి,అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.