శ్రీ కోదండరామాలయంలో వైభవంగా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శ్రీ కోదండరామాలయంలో వైభవంగా

సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ
తిరుపతి, ఫిబ్రవరి 4 (న్యూస్ పల్స్):
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సోమవారం ఉదయం అమావాస్యను పురస్కరించుకుని సహస్రకలశాభిషేకం వైభవంగా జరిగింది.  ఆలయంలో ఉదయం 6.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవర్లకు సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా నిర్వహించారు. రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు హనుమంత వాహనసేవ వేడుకగా జరుగనుంది. సర్వాలంకార భూషితులైన శ్రీకోదండరామస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు చాలా విశిష్టత ఉంటుంది.


 శ్రీ కోదండరామాలయంలో వైభవంగా 
సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో  శ్రీధర్, ఏఈవో  తిరుమలయ్య, సూపరింటెండెంట్  మునికృష్ణారెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 12న శ్రీ కోదండరామాలయంలో రథసప్తమి 
ఫిబ్రవరి 12వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకొని రథసప్తమి పర్వదినాన తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సూర్యప్రభ వాహనం, చంద్రప్రభవాహనంపై శ్రీకోదండరామస్వామివారువారు ఊరేగనున్నారు.  ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 7.30 గంటలకు సూర్యప్రభవాహనం, రాత్రి 7.00 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.