హైదరాబాద్, మార్చి 30, (way2newstv.com)
ఎన్నికలు జరగనున్న నేసధ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 11ను సెలవు దినంగా ప్రకటించింది. పోలింగ్ భవనాలకు రెండు రోజులు సెలవు ఇచ్చింది. తెలంగాణలో ఏప్రిల్ 11న 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో ప్రభుత్వం హాలీడే ఇచ్చింది.
ఏప్రిల్ 11న సెలవు
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సాధారణ సెలవు అమలవుతుందని వెల్లడించింది. పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణి కేంద్రాల ఏర్పాటుకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలు, ఇతర భవనాల్లో నిర్వహించే కార్యాలయాలకు పోలింగ్కు ముందు రోజు ఏప్రిల్ 10తో పాటు పోలింగ్ రోజు ఏప్రిల్ 11న స్థానిక సెలవు దినంగా ప్రకటించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది.