జనసేన ఎకరానికి 8 వేల హామీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జనసేన ఎకరానికి 8 వేల హామీ

హైద్రాబాద్, మార్చి 9, (way2newstv.com)
ఎన్నికల ముంగిట జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే.. ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి రూ.8 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ రెండు అంశాలను పార్టీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. 


జనసేన ఎకరానికి 8 వేల హామీ

‘రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు. నోటికి వచ్చినట్టు రూ.5 లక్షల కోట్ల హామీలు ఇచ్చి మోసం చేయడం ఇష్టం లేకే ప్రతి అంశంలో ఆచితూచి అడుగులేస్తున్నా’నని పవన్ తెలిపారు. ఇచ్చిన హామీలను కచ్చితంగా నిలబెట్టుకుంటానని జనసేనాని చెప్పారు. రైతులకు ఆర్థిక సాయం నిర్ణయం వెనుక రైతు కుటుంబాల్లోని ఆడపడుచుల భద్రత కూడా దాగి ఉందని పవన్ తెలిపారు. పార్టీ పదవుల్లో 33 శాతం మహిళలకే ఇస్తామని జనసేనాని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరిట పెట్టుబడి సాయం అందిస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇందుకోసం నిధులను కూడా కేటాయించింది. కేంద్రం ఇచ్చే రూ.6 వేల సాయంతో కలిపి ఒక్కో రైతు కుటుంబానికి రూ.15 వేల సాయం చేస్తామని బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత జగన్ కూడా రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని ప్రకటించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా.. ఇచ్ఛాపురంలో మాట్లాడిన జగన్.. ప్రతి రైతుకు రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని ప్రకటించారు.గత ఎన్నికల్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి రావడానికి ఈ హామీ తోడ్పడింది.