కన్నుల పండువగా శ్రీరాఘవేంద్ర స్వామి పుట్టినరోజు వేడుకలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కన్నుల పండువగా శ్రీరాఘవేంద్ర స్వామి పుట్టినరోజు వేడుకలు

తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పట్టువస్త్రాలు 
మంత్రాలయం, మార్చి 13, (way2newstv.com)
పవిత్ర పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి పుట్టినరోజు వేడుకలు శ్రీ మఠంలో లో కన్నుల పండువగా జరిగాయి. శ్రీ మఠం పీఠాధిపతులు ఆధ్వర్యంలో  గురు రాఘవేంద్ర స్వామి పుట్టినరోజు వేడుకలు అధికారుల అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా తెల్లవారుజాము నుండే మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలాభిషేకం  పంచామృతాభిషేకం బంగారు కవచ సమర్పణ విశేష పుష్పాలంకరణ గావించి మహామంగళహారతి సమర్పించారు. తిరుపతి దేవస్థానం నుండి వెంకటేశ్వరస్వామి వస్త్రాలను టీటీడీ అధికారులు మంత్రాలయం కు తీసుకువచ్చారు. శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ మఠం నుండి ఊరేగింపుగా వెళ్లి టిటిడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. 


కన్నుల పండువగా శ్రీరాఘవేంద్ర స్వామి పుట్టినరోజు వేడుకలు

అనంతరం టిటిడి వస్త్రాలను శిరస్సులపై ఉంచుకొని శ్రీ మఠానికి తీసుకువచ్చి రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అలంకరించారు. టీటీడీ అధికారులు పీఠాధిపతులను సగౌరవంగా సత్కరించారు. అనంతరం టిటిడి అధికారులను కూడా పీఠాధిపతులు శాలువా రాఘవేంద్ర స్వామి జ్ఞాపిక ఫల మంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. పూజల అనంతరం  రాఘవేంద్ర స్వామి ప్రతిమను ,స్వామి మూల బృందావన ప్రతిమను నవరత్న రథోత్సవం ఆశీనులుగావించి అశేష జనవాహిని మధ్య శ్రీ మఠం ప్రాంగణంలో అత్యంత వైభవంగా ఊరేగించారు.తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన నాదహార ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దాదాపు 400 మంది భక్తులు సంగీత కచేరీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పండిత కేసరి శ్రీ గిరిరాజ ఆచార్య  సంస్కృత పాఠశాల ప్రిన్సిపల్ వాదిరాజాచార్ మాధవ శెట్టి శ్రీనివాస రావు గిరిధర్ ip నరసింహస్వామి శ్రీపతి ఆచార్ వ్యాసరాజ ఆచార్  బిందు మాధవ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.