ఒంగోలు,మార్చ్ 30 (way2newstv.com):
ప్రకాశం జిల్లా యర్రగొడపాలెం లో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై యస్ విజయమ్మ రోడ్డు షో నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం యర్రగొండపాలెం ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. యర్రగొండపాలెం వైయస్ ఆర్ పార్టీ అధ్యర్ది మాజీ ఎమ్మెల్యే డాకట్ర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో జరిగిన రోడ్ షో లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాస రెడ్డి, మార్కాపురం మాజీ ఏం ఎల్ ఏ జంకే వెంకట రెడ్డి ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. విజయమ్మ మాట్లాడుతూ ఈ ఎన్నికలు నీతికి అవినీతికి. ధర్మానికి ధర్మానికి మద్య జరుగుతున్న పోరాటం అని అన్నారు.
యర్రగొండపాలెంలో విజయమ్మ పర్యటన
నీతిని ధర్మాన్ని కాపాడుకోవడానికి నియోజక వర్గ ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని చెప్పారు. ఒక సారి ప్రజలందరూ మాజీ ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖరరెడ్డి పాలన, ఆయన అమలు పరచిన పథకాలను గుర్తు తెచ్చుకోవాలని కోరారు. ప్రజా సేవ కొరకు మీ అందరి సుఖ సంతోషాల కొరకు వై యస్ కుటుంబం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. చంద్రబాబుకి ప్రజలు మమ్మల్ని ఆదరించడం నచడం లేదని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి ని చేయాలని ప్రజలని కోరారు. జగన్ రాష్ట్రానికి మంచి చేస్తాడని అందుకు నేను హామీ ఇస్తున్నా నని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత జిల్లాకు 16 సార్లు వచ్చారని.. కానీ వెలుగొండ ప్రాజెక్ట్ 16 ఇంచులు కూడా ముందుకి వెళ్ల లేదని అన్నారు. జగన్ వచ్చిన వెంటనే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తారని ఆమె చెప్పారు. చంద్రబాబు ఎన్నికల హామీలు ఎవరూ నమ్మకండి అని హెచ్చరించారు.