పతనావస్థలోకి పీలేరు పీహెచ్సీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పతనావస్థలోకి పీలేరు పీహెచ్సీ

తిరుపతి, మార్చి 13, (way2newstv.com)
ప్రజలకు అవసరమైన వైద్యం, వైద్యసేవలు అందివ్వాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై వుంటుంది. వాటిని పొందే హక్కు సమాజంలోని ప్రతి పౌరుడికీ వుంది. అందుకోసం వైద్యశాఖ ప్రజలకు అందుబాటులో ఆరోగ్యకేంద్రాలు, వైద్యశాలలు ఏర్పాటుచేసి అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చి పనిచేయడానికి వైద్యలు, వైద్య సిబ్బందిని నియమించి, మందులు అందుబాటులో వుండేలా పర్యవేక్షించే యంత్రాంగం కూడా వుంటుంది. అయితే ప్రస్తుతం ఈవ్యవస్థ నిర్లక్ష్యం నీడలో కునుకు తీస్తోందన్న విమర్శలూ లేకపోలేదు. ఫలితంగా ప్రజల ఆరోగ్యానికి రక్షణ కరువవుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వం తన 
ప్రోత్సాహం కూడా తగ్గించు కుంటోందన్నఅనుమానాలను పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు.  పీలేరు పట్టణం రెండు జాతీయ రహదారులమధ్య సుమారు 45వేల జనాభాతో విస్తరించి వుంది. ఇక్కడి సామాజిక వైద్య కేంద్రంలో పేద, మధ్యతరగతి ప్రజలతోపాటు వచ్చే ఇతరరోగులకు, ప్రమాదాలకు లోనైన క్షతగాత్రులకు మంచి వైద్యం అందుతుండడంతో రోజు రోజుకూ ఇక్కడ ఓపీలో రోగుల సంఖ్య పెరుగుతోంది. ఆసంఖ్యకు తగ్గ మౌలిక వసతులు, ప్రాథమిక అవసరాలు కల్పించడంలో జాప్యం చోటుచేసుకుంటోందని చెప్పవచ్చు. 


పతనావస్థలోకి పీలేరు పీహెచ్సీ

1998లో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అప్పటి పట్టణ జనాభా ప్రాతిపదికన ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని 30 నుండి 50 పడకలస్థాయికి అభివృధ్ధి పరిచారు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభాను అనుసరించి ఇక్కడ వైద్యులు. వైద్యసిబ్బంది, ఆధునిక వైద్యపరికరాలు, వంద పడకలస్థాయి, ఆసుపత్రి హోదా పెంచి ఒక్కొక్కటిగా అభివృధ్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, వైద్యవిధానపరిషత్‌పై వుంది. ఈఆసుపత్రికి స్థానికులతోపాటు పరిసర ప్రాంతలకు చెందిన ప్రజలు ప్రతిరోజూ 5 నుంచి 7వందలమందికిపైగా ఔట్‌ పేషంట్లు, ప్రమాదాలకు లోనై అత్యవసర వైద్యంకోసం వచ్చే క్షతగాత్రులు, 70 మంది వరకు ఇన్‌పేషంట్లు, సీమాన్స్‌ సెంటర్లో 20 మందిదాక గర్భవతులకు వైద్యసేవలు అందుతున్నాయి. కనీ ఇక్కడ పెరుగుతోన్న రోగులకు తగ్గ సదుపాయాలు కల్పించడం, వైద్యులు, వైద్యసిబ్బంధిని నియమించడం జరగడంలేదు. దీంతో ప్రస్తుతం పీలేరు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ నెమ్మది నెమ్మదిగా పతనావస్థలోకి జారుకుంటూ నాయకుల హామీలకు, పాలకుల ప్రాబల్యాల, నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా మిగలనుంది. సుమారు ఏడు మండలాల పరిధిలోని ప్రజలు ఈఆసుపత్రి నుంచి ఉచిత వైద్యసేవలు అందుకుంటున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యనుబట్టి, ప్రజల అవసరాలకు అనుగుణంగా దీన్ని 100 పడకల స్థాయికి పెంచి అభివృధ్ధి చేయాల్సివుంది. అయితే అది గత దశాబ్దకాలంగా ప్రతిపాదనలకే పరిమితం అయిపోయంది. వున్న ఆసుపత్రిలో రోగులకు తగినన్ని నీరు అందుబాటులో లేక పోతుండడంతో ఓపి లోని రెండింటిలో ఒక మరుగుదొడ్డికి తాళం వేశారు. దీంతో ఓపికి వచ్చే పేషంట్లు లింగబేధం లేకుండా వున్న ఆఒక్క మరుగు దొడ్డినే వినియోగించుకోక తప్పడంలేదు. ఇక వార్డుల్లోని మరుగుదొడ్లతోపాటు స్నానపు గదులూ నీరు లేక కంపుకొడుతున్నాయి. ఆసుపత్రికి వచ్చే రోగులకు స్వఛ్ఛమైన నీటికోసం దాతలు ఏర్పాటుచేసిన ఆర్‌ఓఆర్‌ సిస్టంకూడా నీరందక నిరుపయోగంగా మారింది. ఆసుపత్రిలో తాత్కాలిక నీటి అవసరాల ్పుకోసం కొంత మేరకు ట్యాంకర్లతో కొంటున్నా అవీ చాలడంలేదు. కమ్యూనిటీ ఆసుపత్రితోపాటు సీమాన్స్‌ కేంద్రం లోను వైద్యుల, సిబ్బంధి కొరత వుండడంతో వున్న సిబ్బంధిపై అదనపు పనిభారం పడుతోందని సిబ్బంధి తమ అసహాయతను వ్యక్తం చేస్తున్నారు. రోగులను అత్యవసర పరిస్థితుల్లో ఒకచోటు నుంచి మరో చోటుకు తరలించడానికి వీలుగా అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాల్సి వుంది. గతంలో ఇక్కడ వున్న అంబులెన్స్‌ను డ్రైవరు లేడన్న కారణంగా చిత్తూరు ఆసుపత్రికి తరలించుకు వెళ్లి పోయారు. దీంతో ఈ ఆసుపత్రికి వచ్చే రోగులు, క్షతగాత్రులను అత్యవసర వైద్యం కోసం బయటి ప్రారంతానికి తీసుకు వెళ్లడంలో ఇబ్బందులు ఎదురౌతున్నాయని పలువురు అంటున్నారు. ఇక్కడ అత్యవసర పరిస్థితిలోని రోగులకు, ప్రమాదాల బారిన పడి వచ్చే క్షతగాత్రులకు తగినన్ని పడకలు, అవసరమైన వైద్య నిపుణులులేక పోవడంతో ఆసుపత్రికి వచ్చే బాధితులకు ప్రథమ చికిత్సమాత్రం అందించి తిరుపతికి రెఫర్‌ చేయక వైద్యులకు తప్పడం లేదు. సుమారు దశ్ధాకాలానికి ముందు నుంచి వంద పడకల ఆసుపత్రి ప్రతిపాదనలకే పరిమితం అయిపోయంది. అంతేకాకుండా వున్న 50 పడకల ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ పోస్టు సుమారు దశాబ్ద కాలంగా భర్తీకి నోచుకోవడం లేదు. వంద పడకల ఆసుపత్రిగా దీన్ని అభిృపరిస్తే ఎముకలు, కంటి వైద్య నిపుణణులతోపాటు ఎంఎస్‌ జనరల్‌ పోస్టులు కూడా వస్తాయని అప్పుడు రోగుల్ని బయటి ఆసుపత్రులకు పంపకుండా వారికి ఇక్కడే వైద్యసేవలు పొందే వీలుంటుంది. ఇకనైన ప్రభుత్వం స్పందించి పీలేరుకు మంజూరైన వందపడకల ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతులు జారీ చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేసు కుంటున్నారు.