ఆమర జవాన్లుకు ముస్లిం సోదరులు ఘన నివాళి

జగిత్యాల  మార్చ్-01, (way2newstv.com)
కోరుట్ల పట్టణంలో ముస్లిం మైనారిటీ సోదరులు పారామిలటరీ పై దాడులను ఖండిస్తూ పుల్వామా దాడుల్లో అమరవీరులు అయినా జవాన్లుకు ఘన నివాళులర్పిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు.  కోరుట్ల పట్టణంలో శుక్రవారం నమాజ్ ఆనంతరం ముస్లిం సోదరులు జమే మజీద్ నుండి కార్గిల్ చౌరస్తా వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ యువకులు రిహన్ ,సుజాయిత్ అలీ,అతిక్, అజరోద్దీన్, ఫజల్,అస్లాం మాట్లాడుతూ పుల్వామాలో వీరమరణం పొందిన జవాన్లను స్మరించుకుని వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని  ప్రార్థన  చేశారు. 

 
ఆమర జవాన్లుకు ముస్లిం సోదరులు ఘన నివాళి

ఎండనక వాననక సరిహద్దుల్లో కునుకు లేకుండా మనకోసం మన దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన జవాన్లక్కీ జోహార్లు పలికారు.వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు అండగా నిలువలని కోరారు. పుల్వామా దాడులని మనసులో పెట్టుకుని మంగళవారం రోజు ప్రతీకారం తీరుచుకున్న భారత ఆర్మీ ఘనతను కొనియాడారు.వీరమరణం పొందిన జవాన్లు పాక్ పై దాడి చేసి 308 మంది ముష్కరులను హతమార్చి యుద్ధాన్ని అంకితం చేసిన ఆర్మీ పట్ల హర్షం వ్యక్తం చేశారు.మీ త్యాగం వృధా కాకుండా పాక్ మరోసారి జవాన్లు పై దాడి చేయకుండా  భారత ఆర్మీ బుద్ధి చెప్పడంతో పాక్ కాళ్లబేరానికి వచ్చింది ఇది మీ త్యాగం వల్లే అని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  సర్దార్ సమి ఉల్లహా అమీర్, రావుఫ్, మసి, ఇలియస్, ఇర్ఫాన్ ముస్తఫా, ఫర్హాన్ ముస్తఫా, జాకీ, జియా, వాజీద్, ఇమ్రాన్, షోయిబ్, అక్రమ్, ఇమ్రాన్, షకీల్, తలహా, మిస్బా తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post