స్వదేశం లోనే విదేశీ విద్యావకాశాలు

ఆస్ట్రేలియా ఏసీ కాలేజీ మొదటి క్యాంపస్ ను ప్రారంబించిన దత్తాత్రేయ  
హైదరాబాద్ మార్చ్ 1 (way2newstv.com)
ఆస్ట్రేలియా కేంద్రంగా కలిగిన ఏసీ కాలేజీ  భారతదేశంలో మొదటి క్యాంపస్ ను హైద్వేరాబాద్ లోని ఎఎస్ రావు నగర్ వద్ద నేడు ఎం పి ,మాజీ కేంద్రస్ మంత్రి బందరు దత్తాత్రేయ ప్రారంభించారు. ఏసీ కాలేజీ ఆస్ట్రేలియా నుండి ప్రతినిధుల బృందం ప్రత్యేకంగా భారతదేశానికి రావడంతో పాటుగా తమ మొట్టమోదటి క్యాంపస్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా దత్తాత్రేయ మాట్లాడుతూ తమ స్వదేశంలో ఉండి ఆస్ట్రేలియన్ ఆర్ టీఎలో విద్యనభ్యసించాలని భావించే విద్యార్థులకు ఇది అపూర్వ అవకాశమన్నారు. ఈ అంతర్జాతీయ విస్తరణ వ్యూహ ప్రధాన లక్ష్యం ఆఫ్ షోర్ క్యాంపస్ లొకేషన్స వద్ద వినూత్న మార్గాలలో ప్రోగ్రామ్స్ ను అవగాహన కల్పించడం ఈ కాలేజీ ప్రత్యేకత అని అన్నారు.


స్వదేశం లోనే విదేశీ విద్యావకాశాలు 

అనంతరం ఆస్ట్రేలియా (నార్త్రన్ టెరిటరీ) ఎంఎల్ఎ, విద్యాశాఖామాత్లులు శ్రీహాన్ సెలెనా యిబో మాట్లాడుతూ తమ స్వదేశంలో ఉండి ఆస్ట్రేలియన్ ఆర్ టీఎలో విద్యనభ్యసించాలని భావించే విద్యార్థులకు అపూర్వ అవకాశాన్ని ఈ అంతర్జాతీయ విస్తరణ వ్యూహ ప్రధాన లక్ష్యం ఆఫ్ షోర్ క్యాంపస్ లొకేషన్స వద్ద వినూత్న మార్గాలలో ప్రోగ్రామ్స్ ను అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ వ్యూహంలో భాగంగా మొదటి దశలో ఇండియా, మలేషియా, చైనా నుండి విద్యార్ధులను లక్ష్యంగా చేసుకుని ఆఫ్ షోర్ క్యాంపస్ డెలివరీ లొకేషన్స్ ఏర్పాట్లుకు ప్రణాళిక చేసింది. అధికారిక మార్కెటింగ్ , విద్యార్థులను చేర్చుకోవడం ప్రారంభించడానికి అధికారిక అనుమతును పొందే విధానంలో ఉన్నాం అని శ్రీ పూ తెలిపారు. ఎండీ మరియు ఇండియా భాగస్వామి, స్టడీ గురు (ఆస్ట్రేలియా) గోవింద్ గాజుల మాట్లాడుతూ బిజినెస్, లీడర్ షిప్, మేనేజ్ మెంట్ , ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఎర్లీ చైల్డ్ హుడం కోర్సులను ప్రయోగాత్మకంగా స్థానికంగా హైదరాబాద్ లో అందించడానికి ప్రణాళిక చేశాం అని అన్నారు. భారతి వంటిపల్లి, సీఈఓ అండ్ ఇండియా పార్టనర్, స్టడీ గురు (ఆస్ట్రేలియా) మాట్లాడుతూ భారతీయ కార్యకలపాలు మరియు దీని గుర్తించబడిన క్యాంపస్ ల ద్వారా ఏక్యుఎఫ్ 4, డిప్లొమో, అడ్వాన్స్ డిప్లోమో క్వాలిఫికేషన్స్ ను స్థానికంగా భారతీయ విద్యార్థులకు (అనుమతులు రావాల్సి ఉంది) అందించడాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. ఎసీసీ ఇండియా వద్ద తమ ప్రోగ్రామ్ లను పూర్తి చేసుకున్నవిద్యార్థులకు నార్త్రన్ టెరిటరీల ఏసీసీ ప్రోగ్రామ్స్ లో నేరుగా చేరెందుకు అవకాశాలున్నాయి. తద్వారా డార్విన్ లోని సంస్థ రండు క్యాంపస్ లలో స్టడీ ట్యూరేషన్ తగ్గడంతో పాటుగా ఏక్యుఎఫ్ క్యాలిఫికేషన్ తో ఆస్ట్రేలియాలో ప్రవేశించవచ్చు అని అన్నారు.అనంతరం ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజీ (ఆర్ టీఓ కోడ్ 31642), హైదరాబాద్ , ఇండియా క్యాంపస్ వద్ద నిర్వహించిన సదస్సులో విద్యార్థుల , వారి తల్లిదండ్రులతో ముచ్చిటించారు.

Previous Post Next Post