కడప, మార్చి 23 (way2newstv.com)
వైయస్ జగన్ కత్తిదాడిని తానే చేయంచుకున్నట్లు దుష్ప్రచారం చేశారు. –వివేకానందరెడ్డి హత్య కేసును వైయస్సార్ కాంగ్రెస్ పైకి నెడుతున్నారు. -తెలంగాణా ఎన్నికల సందర్భంగా ఎక్కడా హింస జరగలేదు. తెలంగాణాలో ఆంధ్రప్రజలపై చిన్న సంఘటన కూడా జరగలేదు.అలాంటిది అక్కడ దాడులు జరగుుతన్నాయి. అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని వైకాపా సినీయర్ నేత సీ రామచంద్రయ్య ఆరోపించారు. శనివారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్ర ప్రజలపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు దుష్ఫ్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు..దేశ రాజకీయాల్లో ఇంత బాధ్యత రహితంగా ప్రవర్తించిన వ్యక్తి మరోకరు ఉండరన్నారు. హైదరాబాద్లో భూములు లాక్కున్నారని,ఆంధ్రోళ్లపై దాడులు జరుగుతున్నాయని, పారిశ్రామికవేత్తలను కేసీఆర్ బెదిరించారనే డైలాగులన్నీ చంద్రబాబువి కావా అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ముసుగు తొలగింది
చంద్రబాబు హయాంలో శాంతిభధ్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. -పవన్ కల్యాణ్ ముసుగు తొలగిపోయింది.జనసేన వ్యవహారశైలి అనేది ఇదేనా అని తెలిసిపోతుంది. -చాలామంది అంటున్నారు ఇవి ప్యాకేజి పాలిటిక్స్ అని నిజమేనా అని అడుగుతున్నా.పవన్ కల్యాణ్ నేనేరుగా ప్రశ్నిస్తున్నా.మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి మీరు చేసింది ఏంటని నిలదీసారు. గతంలో చంద్రబాబు చెప్పినవే పవన్ మళ్లీ చెబుతున్నారన్నారు.చంద్రబాబు మాటలకు పవన్ వంత పాడుతున్నారని మండిపడ్డారు.స్వచ్ఛమైన రాజకీయాలు అందిస్తానని ప్రజలకు ప్రామిస్ చేసిన వచ్చిన పవన్ రాజకీయాల తీరు ఇదేనా అంటూ నిలదీశారు. పవన్కల్యాణ్ ప్యాకేజీ పాలిటిక్స్ చేస్తున్నారు.చంద్రబాబు మామకు వెన్నుపోటు పోడిచారని, పవన్కల్యాణ్ తన లక్షలాది అభిమానులకు వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్న కాక మొన్న కేసీఆర్ను పొగిడిన పవన్ నేడు విమర్శిస్తున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. .ప్రాంతీయ తత్వాన్నిచంద్రబాబు, పవన్ లు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. జనసేన .పొత్తుల వెనుక, సీట్లు సర్దుపాటు వెనుక చంద్రబాబు లేరని పవన్కల్యాణ్ గుండెల మీద చేయి వేసుకుని ప్రకటించగలరా అంటూ జనసేన అధినేతకు సవాల్ విసిరారు..