ఎన్నికల ఖర్చుపై నిఘా పెంచండి: - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎన్నికల ఖర్చుపై నిఘా పెంచండి:

కర్నూలు, మార్చి-20 (way2newstv.com)
సాధారన ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల  ఖర్చుపై నిఘా పెంచాలని  జిల్లా ఎన్నికల  అధికారి, జిల్లా  కలెక్టరు యస్. పత్యనారాయణ  అన్నారు.  బుధవారం  కలెక్టర్ కార్యాలయంలోని  సమావేశ మందిరంలో జిల్లాకు వచ్చిన  వ్యయ పరిశీలకులు, ఎస్పి ఫక్కీరప్పతో కలసి ఎక్సపెన్ డిచర్ నోడల్ అధికారులతో    సమావేశం జరిగింది. కర్నూలు పార్లమెంటరీ నియోజక వర్గ వ్యయ పరిశీలకులు యశేందర్ గార్గ్,  ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు వ్యయ పరిశీలకులు నరేష్, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం వ్యయ పరిశీలకులు మనోజ్ ప్రభాకర్, ఆదోని, ఆలూరు వ్యయ పరిశీలకులు యష్పాల్ చావ్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


ఎన్నికల ఖర్చుపై నిఘా  పెంచండి:

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు కడప, ప్రకాశం,  అనంతపురం సరిహద్దు జిల్లాలుగా, కర్నాటక, తెలంగాణ సరిహద్దు రాష్టాలుగా వున్నాయని  ఎన్నికల వ్యయ పరిశీలకులతో అన్నారు. జిల్లా లోపలికి అక్రమంగా నగదు, మద్యం, గోల్డ్, అరాచకశక్తులు ప్రవేశించకుండా గత నెల నుండి నిఘాను ఏర్పాటు చేసామన్నారు. ఇందుకు స్టాటిక్ సర్వవలెన్స్, యంసియంసి  తదితర బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. ఎన్నికల నియమావళి మేరకు ఎటువంటి రశీదులు, రుజువువలు లేకుండా అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన నగదు, మద్యం. గోల్డ్, శాంతిభద్రతలు తదితర అంశాలపై,ప్రతి రోజు ఉదయం 10 గం లోపు ఎన్నికల సంఘానికి నివేదిక పంపుతున్నామని  తెలుపగా, ఆ నివేధికను తమకు కూడ పంపాలని వ్యయ పరిశీలకులు కలెక్టర్ తో అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ ఓ వెంకటేశం, యల్ డియం నగేష్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.