కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ

హైద్రాబాద్, మార్చి 20  (way2newstv.com)
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై కేటీఆర్‌తో చర్చించినట్లు హర్షవర్ధన్‌ తెలిపారు. శ్రీశైలం ముంపు బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం, పాలమూరు - రంగారెడ్డి ముంపు బాధితులకు నష్ట పరిహారం, మాదాసి, కుర్వ వర్గాల దీర్ఘకాలిక సమస్యలను పరిశీలించి న్యాయం చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ వివరించారు. 


కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. అవసరమైతే కాంగ్రెస్‌ పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పాలమూరు  నుంచి మొత్తం 14 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు ఒకే ఒక స్థానం దక్కింది. అది కొల్లాపూర్. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా టీఆర్‌ఎస్ పార్టీలో చేరనుండటం గమనార్హం. కేసీఆర్‌పై విశ్వాసంతో ఆ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నా. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నా. తిరిగి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేయడానికి కూడా సిద్ధం. నియోజకవర్గ ప్రజలు, నా అభిమానులతో చర్చించిన తర్వాతే టీఆర్‌ఎస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకున్నా’ అని హర్షవర్ధన్ తెలిపారు.