మట్టి, ఇసుక, భూమిని దోచారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మట్టి, ఇసుక, భూమిని దోచారు

హైదరాబాద్, మార్చి 26  (way2newstv.com)             
ఈసారి ఎన్నికల్లో గెలిచి వైకాపా అధినేత జగన్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని సినీనటుడు, నిర్మాత మోహన్బాబు అన్నారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో జగన్ సమక్షంలో ఆయన వైసీపీలోకి చేరారు. అనంతరం మోహన్బాబు పార్క్ హయత్ హోటల్ లో మీడియతో మాట్లాడారు. బీజేపీ కి సపోర్ట్ చేసాను. వెంకయ్య నాయుడు , విద్యాసాగర్ రావు ఇద్దరూ ఆత్మీయులు. నేను మద్దతు ఇచ్చిన తరవాత  బీజేపీ 18 శాతం వోటింగ్ వచ్చింది. సుధీర్ఘ కాలం తరువాత వైసీపీ కండువా కప్పుకున్నా. మీ సపోర్ట్ కావాలని జగన్ అడిగాడు. మద్దతు ఇస్తున్నానని అయన అన్నారు. పదవి, ఎలాంటి సీట్ కూడా అడగలేదు. ముందు జగన్ గెలవాలనే ప్రయత్నం అంతేనని అన్నారు. బంధువే అయినా జగన్ పద్ధతి , సీఎం అవుతాడని నమ్మకం ఉంది. ఫీజు విషయంలో 3, 4 సంవత్సరాలు అప్పుడప్పుడు ఆలస్యం అవుతోందని చంద్రబాబుతో మాట్లాడాను. లేఖలు రాసిన  సందర్భాలు అనేకం ఉన్నాయని అన్నారు. ఆలస్యం అయినా కూడా  వారం లో పంపిస్తా అన్నాడు. మాది అటానమాస్ కాలేజ్. ఫీజు రీ యింబర్స్మెంట్ ఇస్తా అన్నప్పుడు ఇవ్వాలి. 


మట్టి, ఇసుక, భూమిని దోచారు

3 విడతలుగా ఇస్తాను అన్నారు కానీ రాలేదు మాకు 19 కోట్ల చిల్లర రావాలి అని చెప్పామని అన్నారు. 2017, 2018 కాపుల ఫీజు రావాలి..అని కూడా చెప్పినా. ఇది నాకోసం కాదు. నా విద్యాలయంలో చదువుతున్న బిడ్డల కోసం. పార్టీ లో చేరిన తర్వాత ఈ ఆరోపణలు చెయ్యలేదు. నాకు సమాధానం . చెప్పాల్సింది అధికారులే. సీఎం  కు కాకా పట్టే వంది మాగదులు కాదని అయన అన్నారు. నేను టీడీపీ లో చేరెప్పుడు వాడి పర్మిషన్ తీసుకున్ననా. రెండు రాష్ట్రాల్లో నా కాలేజ్ లొనే ఎక్కువ ఇన్ టేక్ అని అన్నారు. మీరు బాధ్యత వహించాలని  తల్లిదండ్రుల ను కూడా విజ్ఞప్తి చేసాను. కొన్ని కాలేజ్ ల వారు బొక్కలు ఉన్నాయని, లోపాలు ఉన్నాయని, జీతాలు ఇవ్వకుండా  టీడీపీ తో చేతులు కలిపి పది ఇరవై ఎకరాలు తీసుకున్న వారు ఉన్నారు. ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి, వైఎస్సార్సీపీ లో చేరడానికని అయన అన్నారు. అద్వానీ లాంటి వారి తో కూడా కలిసి ఉన్నాను..పదవులు కావాలంటే అప్పుడే ఆడిగేవాన్ని. చచ్చే వరకు ఎవరికీ భయపడను. తప్పు చేస్తే ఆత్మహత్య చేసుకోవాలి. పేద విద్యార్థుల కోసం తిరిగాను. రెండు కోట్లు వసూలు చేసింది  నిజమే అయితే  మరో రెండు కోట్లు ఇస్తానని అయన సవాల్ విసిరారు. నా విద్యాలయాల్లో  అన్ని లెక్కలు ఉన్నాయి. తెలంగాణ సర్కార్ నుండి నాకు ఎలాంటి బాకీ లేదని అయన అన్నారు. 25 శాతం సీట్లు కుల మతాలకు అతీతంగా 1993 నుండి ఉచితంగా ఇస్తున్నా. కులం కాలం తీసేసినా. నా మీద అనుమానం ఉంటే  ఐటీ దాడులు చెయ్యండని అన్నారు. చంద్రబాబు కూడా నన్ను ర్టీ లోకి ఆహ్వానించారు. అయినా వెళ్ళలేదు. జగన్ మా ఇంటికి వచ్చాడు. లు సార్లు అడిగాడు. చేరాలని అనిపించింది. చేరానని అన్నారు. 2013 లో ఇంటికి పిలిచాను. అప్పుడు.. గౌరవంగా మాట్లాడాను. తప్పేంటి. చంద్రబాబు మట్టి, ఇసుక, భూమి ని దోచి. భూస్వామి అయ్యాడు. ఈ నాలుగున్నర సంవత్సరాలు. ప్రారంభంలో నీ ఆస్తి ఎంత. ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు. నా ఆస్తి 1975 నుంచి నా సంపాదన వివరాలు  ఇస్తా. చంద్రబాబు ఇవ్వగలడా అని అన్నారు. ఎన్టీఆర్ నాకు దేవుడు. 20 ఏండ్ల క్రితం..చంద్రబాబు పక్కన వెళ్లి తప్పు చేశాను.  అని అప్పుడే చెప్పాను. రాజశేఖర్ రెడ్డి నన్ను కాంగ్రెస్ కు ప్రచారానికి రమ్మంటే కుదరలేదు. వెళ్ళలేదు. ఏనాడు వైఎస్ తప్పు పట్టలేదని అన్నారు. చంద్రబాబు చంపించగలడేమో కానీ ఇంకేమి చెయ్యలేరని అన్నారు.