కాకినాడ, మార్చి 20, (way2newstv.com)
తూర్పుగోదావరి జిల్లా ఏపీ రాజకీయాలకు దశా దిశా నిర్ణయిస్తుందని గత ఎన్నికల ఫలితాలు చెప్పక చెబుతున్నాయి. తూర్పు లో ఇప్పుడు టిడిపి నమ్మకం అంతా పసుపు కుంకుమ పధకం పైనే. ఈ సంక్షేమ పథకమే తమను ఏదో విధంగా గట్టెక్కిస్తుందని నమ్మకంతో వుంది ఆ పార్టీ. దీనితో బాటు పెన్షన్ స్కిం ఓట్ల వర్షం కురిపిస్తుంది అని లెక్కస్తోంది అధికారపార్టీ. హోరాహోరీగా సాగే ముక్కోణపు పోటీలో ఏదోరకంగా బయట పడొచ్చని ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ చీల్చడం తమ పార్టీ కి కలిసొచ్చేదన్నది పసుపు పార్టీ అంచనా.అలాంటి జిల్లాలో అధికార టిడిపికి ఈ ఎన్నికల్లో ఎదురుగాలి తప్పేలా లేదు. గత ఎన్నికల్లో సాయం పట్టిన బిజెపి, జనసేన లు ఈసారి ఎన్నికల్లో జారిపోయి ప్రత్యర్థులుగా నిలవడం గోదావరి జిల్లాల్లో తెలుగుదేశానికి ఎదురు దెబ్బే అని అంటున్నారు విశ్లేషకులు. ఆ ఎన్నికల్లో మూడు పార్లమెంట్ స్థానాలను 14 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న టిడిపి ఈసారి మిత్రులు దూరంకావడంతో ఒంటరిగానే బరిలోకి దిగుతుంది.
పసుపు కుంకుమపైనే టీడీపీ ఆశలు
పొత్తులు, కుల, మత ఈక్వేషన్లపై జయకేతనం ఎగురవేస్తూ వస్తున్న తెలుగుదేశానికి ఈసారి అవేమీ కలిసి రావడంలేదు.పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనడానికి అంతకుముందు పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు ఏ పార్టీకైనా అవసరం. వారికి ప్రజల్లో బలం లేకపోతే సహజంగా ఆ పార్టీ టికెట్లు నిరాకరించాలి. కానీ చిత్రంగా తూర్పు గోదావరి జిల్లానుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు ఈసారి ఎన్నికల్లో తిరిగి పోటీ చేయడం లేదు. ఇందులో రాజమండ్రి ఎంపి మురళి మోహన్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు స్వచ్ఛందంగా ప్రకటించడం, కాకినాడ ఎంపి తోట నరసింహం అధికారపార్టీకి గుడ్ బై చెప్పి సతీ సమేతంగా ఫ్యాన్ పార్టీ చెంతకు వచ్చేయడం, అమలాపురం ఎంపి పండుల రవీంద్రబాబు సైతం తోట కు ముందే జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడం టిడిపి ఊహించని రీతిలో జరిగిపోయాయి. వీటికి తోడు వెళ్లినవారంతా టిడిపిని బండబూతులు తిడుతున్న నేపథ్యంలో అధికారపార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి.వీరికి జతగా వైసిపి నుంచి టిడిపిలోకి వెళ్లి టికెట్ దక్కకపోవడంతో సొంత గూటికి తిరిగి చేరుకున్నారు ప్రత్తిపాడు ఎమ్యెల్యే వరుపుల సుబ్బారావు . తనకు కాకుండా తన మనవడు రాజాకు పసుపు పార్టీ అధినేత టిక్ పెట్టడంపై అగ్గికిమీద గుగ్గిలం అవుతున్నారు వరుపుల. టికెట్ కోసం కాకుండా బేషరతుగా జగన్ చెంతకు చేరుకున్న సుబ్బారావు ఇప్పుడు ప్రత్తిపాడు వైసిపికి పెద్ద ఆస్తిగా మారారు. జిల్లాలో ఫ్యాన్ గాలి ఎక్కువైందండానికి ఎంపి ఎమ్యెల్యేల వలసలు చుడండి అనే ప్రచారాన్ని ముమ్మరం చేసింది ఫ్యాన్ పార్టీ.