హైద్రాబాద్, మార్చి 19 (way2newstv.com):
చంద్రబాబు వర్సెస్ పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్. ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధినేత, రాజకీయ వ్యూహాకర్త మధ్య మాటల యుద్ధం జరిగింది. బీహార్ నుంచి వచ్చిన డెకాయిట్ ఏపీలో ఓట్లను తొలగిస్తున్నారు అంటూ సోమవారం ఒంగోలులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ కూడా ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. ‘ఓటమి దగ్గరపడితే ఎంతటి అనుభవం ఉన్న రాజకీయ నేతైనా వణికిపోతారు.. చంద్రబాబు చేసిన నిరాధారమైన ప్రేలాపనలు విని పెద్ద ఆశ్చర్యపడలేదు.
పీకే, బాబుల మధ్య మాటల యుద్ధం
సార్ జీ బీహారీ బందిపోటు అంటూ నన్ను అమర్యాదపూర్వకంగా సంబోధించడం.. బీహార్‌పై మీకున్న చెడు అభిప్రాయాన్ని బయటపెడుతోంది. ఏపీ ప్రజలు మీకు మళ్లీ ఎందుకు ఓటు వేయాలో.. దానిమీద దృష్టిపెడితే మంచిది ’అంటూ సలహా ఇచ్చారు. మరి ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలకు చంద్రబాబు, టీడీపీ నేతలు ఎలా కౌంటరిస్తారన్నది ఆసక్తిగా మారింది.