తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ

హైదరాబాద్ మార్చ్ 20 (way2newstv.com
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌ రెడ్డి ఆ పార్టీని వీడి గులాబీ గూటికి చేరనున్నారు. ఈ మేరకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో బుధవారం సమావేశమయ్యారు. త్వరలో పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరుతానని ప్రకటించారు. అవసరమైతే పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తానని వెల్లడించారు. 


తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ

కొల్లాపూర్‌ నియోజకవర్గం అభివృద్ధికి కేటీఆర్‌ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా చెప్పారు.ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి పలువురి ఎమ్మెల్యేల చేరికతో తెరాస బలం 100కి చేరింది. నామినేటెడ్‌ ఎమ్మెల్యేతో కలిపి 101 ఉంది. మరో నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడినట్లయితే అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా పోతుంది. మరోవైపు మరో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమతో చర్చలు జరుపుతున్నారని తెరాస చెబుతోంది.
Previous Post Next Post