మహబూబాబాద్, మార్చ్,20 (way2newstv.com)
బిజెపి. కాంగ్రెస్ పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం. ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతుంది. ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఖాయమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం తొర్రూరు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడారు.
వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే
తెలంగాణ ఉద్యమకాలంలో టీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న అప్పుడు రాజీనామా చేయించాలని గుర్తులేదా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ లో చేరే వారిని రాజీనామా చేయించాలని అనడం హాస్యాస్పదని అయన అన్నారు. తెలంగాణలో 16 ఎంపీ స్థానాలను టిఆర్ఎస్ కైవసం చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో ముందు ఉంటుందని అయన అన్నారు.