ట్రైనీ ఐపీఎస్ డాక్టర్ పి. శబరీష్
చేర్యాల,మార్చి 24 (way2newstv.com)
ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలిగించకుండా తోపుడు బండ్లవారు తమ వ్యాపారాలు కొనసాగించుకోవాలని ట్రైనీ ఐపీఎస్ అధికారి డాక్టర్ పి. శబరీష్ సూచించారు. గురువారం చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో అయన, చేర్యాల సిఐ రఘు, ఎస్ఐ మోహన్ బాబు, చేర్యాల మునిసిపల్ ప్రత్యేక అధికారి శ్రవణ్ కుమార్ కలసి చేర్యాల పట్టణంలో సిద్దిపేట రోడ్డు, ఆకునూర్ రోడ్డు, బచ్చన్నపేట రోడ్డు, బస్టాండ్ ఆవరణలో, తోపుడుబండ్ల వారిని, షాపులు ఎదురుంగా అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన షాపు యజమానులు తో మాట్లాడారు. తోపుడుబండ్ల వారు ఒకే దగ్గర ఆపకుండా బండ్లను పట్టణంలో తిరుగుతూ వ్యాపారం చేసుకోవాలని వ్యాపారులు వివిధ ప్రధాన మార్గాలలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా వ్యాపారాలు చేసుకోవాలని వారు సూచించారు.
ట్రాఫిక్ కు అంతరాయం కలిగించవద్దు
రద్దీ ప్రాంతాలు , మూల మలుపు ప్రాంతాలు , ట్రాఫిక్ కు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. దుకాణాల సామాన్లు షాప్ ముందర పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని షాపు యజమానులకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు, రాంగ్ పార్కింగ్ వలన జరుగుతున్న అసౌకర్యాల పై అవగాహన కల్పించారు. *ప్రతి మంగళవారం జరిగే సంత వచ్చే మంగళవారం నుండి గ్రామపంచాయతీ, ప్రభుత్వ ఆసుపత్రి, ఆకునూరు వెళ్లే రోడ్లో సంత నిర్వహించుకోవాలని సంత నిర్వాహకులకు సూచించారు. సంత నిర్వహించుకోవడానికి మున్సిపల్ అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్స్ సాయి కిరణ్ పాల్గొన్నారు మరియు చేర్యాల ప్రజాప్రతినిధులు బాలరాజ్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.