హైదరాబాద్, మార్చ్ 25 (way2newstv.com)
ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణ లోక్ సభ ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న భద్రత సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాం. ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి సమన్వయంతో పని చేస్తున్నామని రాష్ట్ర అడిషనల్ డీజీ జీతేందర్ అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. జిల్లా సరిహద్దుల్లో ప్రణాళిక ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేశాం. సీనియర్ పోలీసు అధికారులు ప్రతి రోజు పరిస్థితులను సమీక్షిస్తారు. రాష్ట్రంలో 34,667 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 6,394 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు సరిపడా భద్రత సిబ్బంది ఉన్నారని అన్నారు. ప్రచారంలో పాల్లోనే వీఐపీలకు కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తాం.
ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఎన్నికల నిర్వహణ కోసం తెలంగాణకు చెందిన 48,058 పోలీసులు భద్రతలో పాలుపంచుకుంటారని అన్నారు. కేంద్ర బలగాలు 145 ప్లాటూన్స్, టీఎస్ ఎస్ పీ కి చెందిన 16 ఫ్లాటూన్ల బలగాలతో భద్రత, రాష్ట్ర సరిహద్దులైన చత్తిస్ ఘర్,మహరాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని అయన అన్నారు. ఎన్నికలు బహిష్కరించాలన్న మావోలకు ప్రజల స్పందన లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నుంచి ఇప్పటి వరకు 198 కేసులు నమోదు అయ్యాయి. 405 ప్లయింగ్ స్క్వాడ్స్,395 సర్విలయన్స్ టీమ్ లు పని చేస్తున్నాయి. ఎయిర్ అంబులెన్స్,హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచాం. ఇప్పటి వరకు 7 కోట్ల 22 లక్షల 75 వేల 156 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నాం. 83,156 మందిని బౌండ్ ఓవర్ చేశాం. 8,394 లైసెన్స్ వెపన్స్ డిపాజిట్ అయ్యాయని అయన వెల్లడించారు. 2,540 నాన్ బెయిలబుల్ వారంట్లను జారీ చేశాం. 46 లక్షలు విలువ చేసే 14వేల లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామని అయన అన్నారు.