కరీంనగర్, మార్చి 18 (way2newstv.com)
ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యల్లో అసహనం కనిపిస్తుంది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మీ ఫెడరల్ ఫ్రంట్ లో ఉన్న పార్టీలు కేవలం టీఆర్ఎస్, ఎంఐఎం మాత్రమేనని బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. నేను నిఖార్సైన హిందూ అని కెసిఆర్ అనడంలో అంతరార్థం ఏంటని అయన ప్రశ్నించారు. ఓటు బ్యాంక్ ను దెబ్బ తీసేందుకు ఇలాంటి మాటలు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంపై మీ వైఖరి ఎంటి. హిందూ సమాజాన్ని సంఘటితం చేసే విషయంలో మీ ఆలోచన ఏంటి. హిందువులను చంపుతా, హిందూ దేవతలను అవమానించే వారితో కెసిఆర్ పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.
తెరాస డిపాజిట్ గల్లంతువుతుంది
మైనారిటీల కోసమే తెలంగాణ విమోచన దినాన్ని కాదనుకున్నారు. శబరిమల ఘటనపై ఏనాడైనా మాట్లాడారా? మతతత్వ పార్టీని పక్కన పెట్టుకున్న కెసిఆర్ కు బీజేపీ గురించి మాట్లాడే అర్హత లేదు. ఫార్మ్ హౌజ్ కు పరిమితమైన మీ వైఖరిని ప్రజలు చూస్తున్నారని అయన అన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారీ చంద్రబాబు, కెసిఆర్ లోపాయికారీ ఒప్పందం పెట్టుకుంటారు. తెలంగాణాకు వచ్చిన చంద్రబాబు కెసిఆర్ ను తిట్టినా, రేపు కెసిఆర్ పోయి ఆంధ్రాలో చంద్రబాబును తిట్టినా... అది వారివారి స్వలాభాల కోసమేనని అయన అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గల్లంతు అవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ కు వేసినట్టే. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ డిపాజిట్ గల్లంతు అవుతుంది. 16 స్థానాల్లో కూడా టీఆర్ఎస్ కి గడ్డుకాలమేనని సంజయ్ అన్నారు.