హైదరాబాద్,మార్చి 18, (way2newstv.com)
ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ చెప్పిన ఫెడరల్ కూటమి ఎటుబోయింది .. ఇప్పుడు జాతీయ పార్టీ అంటున్నాడని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే స్వాగతిస్తాం. కరీంనగర్ జిల్లాకు కేసీఆర్ గతంలో ఇచ్చిమ హామీలకు సమాధానం చెప్పకుండా . ప్పటివరకు ఒక్క డీఎస్సీ పెట్టలేదు .. డబుల్ బెడ్ రూమ్ లేవని అన్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ కు 15 ఎంపీలు ఉన్నారు.
కేసీఆర్ ఖమ్మం నుంచి పోటీ చేయాలి
కేంద్రం నుంచి ఒక్క హామీనైనా సాధించారా . కనీసం కాళేశ్వరానికి జాతీయా హోదా కూడా సాధింవహాలేకపోయావని అన్నారు. టిఆర్ఎస్, బీజేపీ లు ఏ టీమ్, బీ టీమ్ అని ప్రజలకు పూర్తి అవగాహన వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో మోదీని తిడతారు. ఢిల్లీ వెళ్లి మోడీ కాళ్ళు మొక్కుతారు. ఒక్కో ఎమ్మెల్యేను 25 కోట్లకు పైగా పెట్టి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను భయపెట్టి డబ్బులిచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు చేసే వ్యక్తి దేశానికి నాయకత్వం వహిస్తే .. దేశం ఏమి కావాలని అన్నారు. కేసీఆర్ కు దైర్యం ఉంటే ఖమ్మం ఎంపీగా పోటీ చెయ్యాలి. ఖమ్మం లో మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు. మరి ఆ జిల్లా ప్రజల మద్దతు మీకు ఉందా కాంగ్రెస్ కు ఉందా తేలిపోతుంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారో ప్రజలు నిలదీయాలి. కేసీఆర్ అబద్దాల కోరు. రాష్ట్రానికి పట్టిన చీడపురుగని అయన విమర్శించారు.