బొంగరం కుడా తిప్పలేడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బొంగరం కుడా తిప్పలేడు

హైదరాబాద్, మార్చి 18 (way2newstv.com)
ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ కేంద్ర నాయకులు., బీజేపీ ని మాట్లాడిన మాటలు నవ్వేవిధంగా ఉన్నాయి. కేటీఆర్ ,కేసీఆర్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్ విమర్శించారు.  ఏదో చెప్తూ నీతులు వల్లించినట్లు మాట్లాడుతున్నారు. రంగులు మార్చే ఊసరవెల్లి లాగా ఇష్టం వచ్చినట్లు మట్లాడుతున్నారు.మీరు ఎందులో నంబర్ వన్ అనేది చెప్పాలని అన్నారు. రెండు లక్షల కోట్ల అప్పులు చేయడం, .పార్టీ ఫిరాయింపులు చేయడం లో మీరు నంబర్ వన్ ఆని చెప్పాలి. ఆరు సంవత్సరాలుగా సీఎం గా ఉంటూ ఒక్క సారి కూడా సెక్రటేరియట్ కు రాలేదు. 


బొంగరం కుడా తిప్పలేడు

ప్రగతి భవన్ కు పరిమితం అయిన మీరు ప్రధాని పై ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులు చేస్తారా  శీరి చింతకు కడతాం అన్న మీరు ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చింతకు కట్టాలి. సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యే లను కొంటున్నారు. మీరు ఢిల్లీ లో చక్రం కాదు కదా బొంగరం కూడా తిప్పలేరని అయన వ్యాఖ్యానించారు. తెలంగాణ తరహా దేశాన్ని తీర్చుదిద్దుతాం అంటున్న మీరు ఏ విధంగా చేస్తారో సమాధానం చెప్పాలి. అన్ని అధికారాలు రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్తున్న మీరు ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు.  టెకేదరి అన్న నువ్వు మజ్లీస్ పార్టీ కే టెకేదరి వి మాత్రమే నువ్వు. యజ్ఞాలు చేసినంత మాత్రాన హిందువు కావు నువ్వు. అయోధ్య రామ మందిరం పై మీ పార్టీ వైఖరి చెప్పు కేసీఆర్ అని ప్రశ్నించారు. కేసీఆర్ ది.., టీఆర్ఎస్ ది ద్వంద వైఖరి, ద్వంద నీతి. మజ్లీస్ పార్టీ ముష్టి పార్టీ అన్న మీరు ఎలా ముద్దయిందో చెప్పాలని డిమాండ్ చేసారు