పోలీసు విధులకు ఆటంకం కల్పించారని కేసు. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పోలీసు విధులకు ఆటంకం కల్పించారని కేసు.

నెల్లూరు, మార్చి 09 (way2newstv.com
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొనింది. వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతుండగా పోలీసులు అరెస్టుచేశారు. పోలీసులు అక్రమ వైఖరికి నిరసనగా ఈ క్షణంనుంచే పోలీసు కస్టడీలో తాను ఆమరణ దీక్ష చేపడుతున్నట్టు అయన ప్రకటించారు.  నెల్లూరు రూరల్లో గిట్టని ఓట్లు తొలగించే కుట్రలో పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తే తనను అరెస్ట్ చెయ్యాలని కేసులు పెట్టడం అన్యాయమని రూరల్ ఎమ్మెల్య రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


పోలీసు విధులకు ఆటంకం కల్పించారని  కేసు.

నెల్లూరు జిల్లాలో పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు. ఓట్ల తొలగింపుకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులకు అప్పగిస్తే చర్యలు తీసుకోకపోగా తమ కార్యకర్తలపైనే కేసులు పెట్టడం వారిని జైల్లో పెట్టించారని అన్నారు దారుణమని అన్నారు. ఓట్లు తీసేస్తున్నారని కొంతమందిని పట్టిస్తే వారిపై చర్య తీసుకోకపోగా పట్టిచ్చిన వారిపైనే కేసులు పెట్టడం , దానిని ప్రశ్నించి న్యాయం అడిగితె తనను అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు..