ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణ భవన్‌లో మాక్ పోలింగ్‌ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణ భవన్‌లో మాక్ పోలింగ్‌

హైదరాబాద్‌ మార్చ్ 11 (way2newstv.com)  
తెలంగాణ భవన్‌లో తెరాస శాసనసభా పక్ష సమావేశం జరిగింది. మంగళవారం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాక్ పోలింగ్‌ను ఈ సందర్భంగా నిర్విహించారు. దీనిలో ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు. రేపు ఉదయం 8గంటలకు తెలంగాణ భవన్ లో మరోసారి ఎమ్మెల్సీ నమూనా పోలింగ్‌ జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యేలు శాసనసభకు బయల్దేరి వెళతారు.


ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణ భవన్‌లో మాక్ పోలింగ్‌

ఈ నెల 17న కరీంనగర్‌, 19న నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. లోక్‌సభ నియోజకవర్గాల్లో 2లక్షలకు తగ్గకుండా జనసమీకరణ చేయాలని ఆయన సూచించారు. ఎంపీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉందని ఆయన వెల్లడించారు. ఎంఐఎంతో కలిసి 17 ఎంపీ స్థానాల్లో విజయం సాధించాల్సిందేనని తేల్చిచెప్పారు.