సమ్మర్ లో కూల్ వాటర్ తో జరాభద్రం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సమ్మర్ లో కూల్ వాటర్ తో జరాభద్రం

హైద్రాబాద్, ఏప్రిల్ 30, (way2newstv.com)
ఎండ చంపేస్తోంది, తీవ్రమైన ఉక్కబోత, వేడితో జనం సతమతం అవుతున్నారు. దీంతో దాహార్తిని తీర్చుకోవడానికి, ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం చల్లని నీరు, శీతల పానీయాలు తాగడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తాగే నీరు ఎంత చల్లగా ఉంటే.. అంతగా దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చల్లటి నీరు తాగొద్దని ఆయుర్వేదం సూచిస్తోంది. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం అనారోగ్యకరమైన ఆహార అలవాట్లలో చల్లటి నీరు తాగడం ఒకటి. తినేటప్పుడు లేదా సాధారణ సమయాల్లో కూల్ వాటర్ తాగడం ఆరోగ్యానికి చెడు చేస్తుంది. కఫ, వాత, పిత్త దోషాల వల్ల జీర్ణ ద్రవాల పనితీరు దెబ్బతినడమే దీనికి కారణం. 



సమ్మర్ లో కూల్ వాటర్ తో జరాభద్రం

ఆహారం తినేటప్పుడు కూడా వెచ్చని నీరే తీసుకోవాలని ఆయుర్వేద గ్రంథాలు సూచిస్తున్నాయి. బాగా చల్లగా ఉండే నీటిని తాగే బదులు గది ఉష్ణోగ్రత (20 °C) వద్ద ఉండే నీటిని తాగాలని చెబుతున్నారు. చల్లని నీరు, కూల్ డ్రింక్స్‌లాంటి శీతల పానీయాలు తాగడం రక్త నాళాలపై ప్రభావం చూపుతుంది, జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. పోషకాలను శరీరం శోషించుకునే సహజ ప్రక్రియ కుంటుపడుతుంది. శరీర సాధారణ ఉష్ణోగ్రత 20 °C. దీని కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే చల్లటి పానీయాలు తీసుకోవడం వల్ల.. జీర్ణక్రియల కోసం, పోషకాలను శోషించుకోవడం ఉపయోగించాల్సిన శక్తిని శరీరం ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి ఉపయోగించాల్సి వస్తుంది. అందుకే గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటిని తాగడం ఉత్తమం. చల్లని పానీయాలు లేదా కూల్ వాటర్ తాగడం వల్ల గొంతు నొప్పి, ముక్కు మూసుకుపోవడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఆహారం తిన్న తర్వాత చల్లటి నీరు తాగడం వల్ల శ్లేష్మం సమస్య ఎక్కువ అవుతుంది. శ్వాస వ్యవస్థ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలెక్కువ.భోజనం చేశాక చల్లటి నీళ్లు తాగితే ఆహారంగా తీసుకున్న కొవ్వులు పేరుకుపోతాయి. వీటిని కరిగించడం శరీరానికి కష్టం అవుతుంది. కాబట్టి ఆహారం తీసుకున్నాక వెంటనే చల్లటి నీరు తాగకపోవడం మంచిది. భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత నీళ్లు తాగడం మంచిదని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. చల్లటి నీరు హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. కూల్ వాటర్ వేగస్ నాడిని ఉత్తేజపరచడం వల్ల గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. ఎక్సర్‌సైజ్‌లు చేసే సమయంలోనూ చల్లటి నీళ్లు తాగొద్దు. కసరత్తులు చేసిన తర్వాత వెచ్చని నీరు తాగాలని జిమ్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. వర్కౌట్ చేసినప్పుడు శరీరంలో చాలా వేడి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి వెంటనే చల్లటి నీరు తాగితే శరీర ఉష్ణోగ్రతల్లో అసమతుల్యత తలెత్తి జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. అంతే కాదు పొట్టలోనూ ఇబ్బందిగా అనిపిస్తుంది.