జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృష్ణ భాస్కర్
సిద్దిపేట, ఏప్రిల్ 10 (way2newstv.com)
ఏప్రిల్ 11 న జరిగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజా స్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని, పోలింగ్ సజావుగా సాగడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృష్ణ భాస్కర్ చెప్పారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరిస్తూ..
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
జిల్లాలోని ఓటర్లందరికీ ఏప్రిల్ 11వ తేదిన జరిగే లోకసభ ఎన్నికలకు ఓటు వేయడానికి కేవలం ఓటరు స్లిప్పు సరిపోదని, ఓటరు స్లిప్ తో పాటుగా ఏదైనా ఒక ధృవ పత్రాన్ని పోలింగ్ అధికారికి చూపాలని, లేనిచో ఓటు వేసేందుకు అనుమతించబడదని పేర్కొన్నారు. వాటిలో 1. ఆధార్ కార్డు, 2. ఎపిక్ కార్డు, 3. పాస్ పోర్ట్. 4. డ్రైవింగ్ లైసెన్స్, 5. సర్వీస్ గుర్తింపు కార్డు, 6. బ్యాంకులు / పోస్ట్ ఆఫీస్ వారు జారీ చేసిన పాస్ పుస్తకము, 7. ఆదాయ పన్న గుర్తింపు కార్డు, 8. స్మార్ట్ కార్డులు, ఆరోగ్య బీమా పథకం కార్డు, . ఫోటో కలిగిన పెన్షన్ పత్రాలు, . ఎంపీ / ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ లకు జారీచేసినటువంటి ఫోటోతో కూడిన గుర్తింపు కార్డును తమ వెంట తీసుకువెళ్లాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ కోరారు.