మంత్రాలయం, ఏప్రిల్ 03 (way2newstv.com)
పవిత్ర పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్సీ హనుమంతప్ప కుటుంబ సమేతంగా మంత్రాలయంకు వచ్చారు.వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ ను అనంతరం రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతులు శ్రీ సుబూదేంధ్ర తీర్థులు వీరికి శేషవస్త్రం ఫల మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.
శ్రీ మఠంలో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ
ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు కర్ణాటక నుంచి మంత్రాలయం కు చేరుకొని రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ఇక్కడి నుండి వెంకటాపురం వెళ్లి అక్కడినుండి పాదయాత్రగా శ్రీశైలం చేరుకొని అమ్మవారు బ్రమారాంబికా దేవి మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ అని ఆయన విలేకరులకు తెలిపారు. మాతోపాటు 25 మంది అభిమానులు శ్రేయోభిలాషులు 15 సంవత్సరాలుగా కన్నడిగుల ఆడపడుచైన భ్రమరాంబికా దేవి అమ్మవారిని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని ప్రతి సంవత్సరం కర్ణాటక రాష్ట్రం నుంచి వేలాది మంది కన్నడిగులు పాదయాత్ర ద్వారా శ్రీశైలం చేరుకొని మా కన్నడిగుల ఆడపడుచు అయినా భ్రమరాంబికా దేవి మల్లికార్జున స్వాముల వారికి పుట్టింటి పట్టుచీర పుట్టింటి లాంఛనాలతో అమ్మవారికి సాంప్రదాయం ప్రకారం పట్టు బట్టలు పిండి వంటలతో వడి బియ్యం పోసి కన్నడిగుల పుట్టింటి సాంప్రదాయాన్ని పాటిస్తున్నామని ఆయన అన్నారు.